ఆంధ్రప్రదేశ్ పీజీ మెడకల్ ఎంట్రన్స్ టెస్ట్-2015 ప్రవేశ పరీక్షలో పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని కండూరి సౌమ్య ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో
‘ఏపీ పీజీ మెట్’లో ఫస్ట్ ర్యాంకర్‌కు
అభినందనల వెల్లువ
విజయనగరం అర్బన్:ఆంధ్రప్రదేశ్ పీజీ మెడకల్ ఎంట్రన్స్ టెస్ట్-2015 ప్రవేశ పరీక్షలో పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని కండూరి సౌమ్య ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2015 మార్చి ఒకటవ తేదీన విశాఖలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం సాయంత్రం విడు దల అయ్యాయి. ఈ మేరకు సౌమ్య తండ్రి కంటూరి పార్థసారథి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్ పూర్తి చేసిన సౌమ్యకు ఇటీవల శ్రీవెంకటేశ్వర మెడికల్ పీజీసెట్ ఫలితాలలో రెండవ స్థానం లభించింది. అప్పట్లో ఆమె ఎంసెట్‌లో 181వ ర్యాంక్ సాధించి ఆంధ్రమెడికల్ కళాశాలలో సీట్ సంపాదించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రముఖ భూమిక వహిస్తున్న రేడియాలజీ, కార్డియాలజీ వంటి విభాగాలలో తనకు స్థిరపడాలని ఉందని తెలిపారు. సౌమ్య తండ్రి పార్థసారథి జువాలజీ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తన కుమార్తె పీజీ సెట్‌లో ప్రథమస్థానం సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందబాష్పాలు రాల్చారు.