
నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు. నందు కెరీర్‌లో ఓ డిఫరెంట్ చిత్రమిది.
తన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా బాగా నటించాడు. నటి తేజస్విని పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మాతో అసోసియేట్ అయిన నిర్మాతలు ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావులకు (హరిహర చలనచిత్ర) కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత.
Comments
Please login to add a commentAdd a comment