అయోమయ ప్రేమ
నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్‌గా పరిచయమవుతోన్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య పాత్రల్లో వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించారు. నిర్మాత రాజ్ కందుకూరి బ్యానర్ లోగోను, ఉత్తేజ్ హీరోయిన్ లుక్‌ను, హీరో నవీన్ చంద్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్‌లోని చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుని విడిపోతున్నాయి.
అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శైలజ.