‘పులిదండి మేరి... మే 22వ తారీఖున పన్నెండు... ఒంటిగంట మధ్య హత్యకు గురైంది’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా ట్రైలర్. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమాలో సీయా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. రైటర్ మోహన్ దర్శకత్వంలో శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.
‘మూడు నెలల మధ్యలో మూడు చావులు... ఇంకెన్ని చావులు చూడాలయ్యా ఈ బీచ్‌లో’, ‘ఇంద్ర ధనస్సులో కలర్లు ఏడు... ఈ క్రైమ్ సస్పెక్ట్‌లు కూడా ఏడే’, ‘నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నాది... కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను... ఇక తీగ లాగడమే...’, అనే డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్‌కు వెన్నెల కిశోర్ జీవం పోశారు. షెర్లాక్ ప్రవర్తనలో హ్యుమర్ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని తెలివితేటలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment