
మందలించారని వెళ్లిపోయాడు
పాలకొల్లు అర్బన్ : మండలంలోని భగ్గేశ్వరం గ్రామానికి చెందిన పోలంకి సాయికిరణ్ గతనెల 24 నుంచి కనబడడం లేదని అతని తండ్రి వెంకటేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కె.రామకృష్ణ కథనం ప్రకారం.. సాయికిరణ్ డిగీ పూర్తి చేశాడు. ఖాళీగా ఉంటూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన రేణుక అనే యువతిని తల్లిదండ్రులకు తెలీకుండా హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
దీంతో అతని తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పాలకొల్లు పోలీస్‌స్టేషన్ నంబర్ 08814-222333, లేదా పట్టణ సీఐ సెల్ నంబర్ :9440796668, లేదా పట్టణ ఎస్‌ఐ సెల్ నంబర్ : 8500506071ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.