సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సాయి కిరణ్, హారిక సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ‘ఉత్తమ అథ్లెట్స్’గా నిలిచారు. నిజాం కాలేజీకి చెందిన డి. సాయి కిరణ్ 927 పాయింట్లు సాధించగా... డీవీఎం కాలేజీకి చెందిన డి. హారిక 973 పాయింట్లతో నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (41 పాయింట్లు)... మహిళల విభాగంలో వనిత మహావిద్యాలయ (43 పాయింట్లు) ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ అథ్లెట్ పి. శంకర్ విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు.
ఇతర పోటీల విజేతల వివరాలు
100మీ. పురుషులు: 1. కె. మహేశ్ (జీసీపీఈ), 2. కె. రాము (జీసీపీఈ), 3. విజయ్ (నిజాం). మహిళలు: 1. హారిక (డీవీఎం), 2. విశాలాక్షి (వనిత), 3. సుజాత (శివాని). 400మీ. పురుషులు: 1. డి. సాయికృష్ణ (నిజాం), 2. సాయి కుమార్ (జీసీపీఈ), 3. రహమాన్ (సెయింట్ జోసెఫ్). మహిళలు: 1.సుస్మిత (నిజాం), 2. బి. సాహితి (లా కాలేజీ), 3. సునీత (నిజాం). 10,000మీ. పురుషులు: 1. బి. రమేశ్ (పీజీ, సికింద్రాబాద్), 2. రంగయ్య (న్యూ బద్రుక), 3. శివానంద్ (అవంతి). మహిళలు: 1. అంకిత (కస్తూర్బా), 2. లావణ్య, 3. తేజస్విని. ట్రిపుల్ జంప్ పురుషులు: 1. వినోద్ కుమార్ (లయోలా), 2. సతీశ్ (నిజాం), 3. ఆర్. వెంకటేశ్ (ఏవీ కాలేజీ). మహిళలు: 1. పి. వీణ (ఏవీ కాలేజీ), 2. హిజ్రత్ (ఓయూ ఆర్‌ట్స), 3. రవళి (లయోలా).
డిస్కస్ త్రో పురుషులు: 1. అంకిత్ (హాజీ గౌజ్ పీఈ), 2. జె. రాజు (నిజాం), 3. లిఖిత్ (భవన్‌స). మహిళలు: 1. సుమన, 2. సైరీ పాల్ (ఏవీ కాలేజీ), 3. డి. మానస (లయోలా). హ్యామర్ త్రో పురుషులు: 1. కె. అన్వేశ్ (నిజాం), 2. అంకిత్ (హాజీ గౌస్), 3. జి. శ్రవణ్ (లయోలా). మహిళలు: 1. కె. నాగ అనూష, 2. యాస్మిన్, 3. అఖిల. జావెలిన్ త్రో పురుషులు: 1. చార్లెస్ (ఓయూ), 2. ఎం. ప్రకాశ్ (జీసీపీఈ), 3. బి. రమేశ్ (నిజాం). మహిళలు: 1. డి. మానస (లయోలా), 2. రవళి (లయోలా), 3. ఆస్మా (సిద్ధార్థ). 110మీ. హర్డిల్స్ పురుషులు: 1. వి. సాయికుమార్ (శ్రీమేధ), 2. డి. సాయి కిరణ్ (నిజాం), 3. వినోద్ కుమార్ (లయోలా). మహిళలు: 1. విశాలాక్షి (వనిత), 2. హఫీజా (సెయింట్ ఆన్‌స), 3. మేనిత (ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ). 1500మీ. పురుషులు: 1. కె. అనంద్ (జీడీసీఎస్), 2. వి. మారుతి (హాజీ గౌస్), 3. పి. మహిపాల్ (జీసీపీఈ). మహిళలు: 1. ప్రియాంక (వనిత), 2. మానస (కస్తూర్బా), 3. సునీత (నిజాం). 3000మీ. స్టీపుల్ చేజ్ పురుషులు: 1. శ్రీనివాస్ (జీసీపీఈ), 2. బి.రంగయ్య (బద్రుక), 3. బి. ప్రశాంత్.
‘ఉత్తమ అథ్లెట్స్’ సాయి కిరణ్, హారిక
Published Thu, Nov 17 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
Advertisement
Advertisement