Athletic championship
-
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి.. -
సౌరవ్ గంగూలీనే మళ్లీ..
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్... (మలేసియా) ఆటగాడిపై విజయం సాధించాడు. భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారిని సెయింట్ జాన్స్ అకాడమీ ఘనంగా సత్కరించింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
హైదరాబాద్‌కు ఓవరాల్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన కౌశిక్ స్వర్ణంతో మెరిశాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో శనివారం జరిగిన బాలుర అండర్– 20 డెకాథ్లాన్‌లో కౌశిక్ 4,414 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. 3,137 పాయింట్లతో ఉదయ్ కుమార్ (రంగారెడ్డి) రెండో స్థానంలో, 2414 పాయింట్లతో తరుణ్ (వికారాబాద్) మూడో స్థానంలో నిలిచారు. బాలికల అండర్–16 టీమ్ విభాగంలో హైదరాబాద్ జట్టు 27 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. బాలికల అండర్–18 100 మీటర్ల హర్డిల్స్ పరుగును అందరికంటే వేగంగా 14.82 సెకన్లలో ముగించి సీహెచ్ పద్మశ్రీ పసిడిని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో నందిని (మేడ్చల్) నిలిచి రజతాన్ని గెలిచింది. ఇతర పతక విజేతలు: అండర్–14 బాలుర విభాగం: 600 మీ: 1. కె.శ్రీను (నాగర్ కర్నూల్) 2. బి.వినోద్ కుమార్ (జయశంకర్ భూపాలపల్లి) 3.టి.ప్రవీణ్ (వరంగల్ అర్బన్). అండర్–16: 800 మీ: 1. కె.తరుణ్ (నాగర్ కర్నూల్) 2.బి.రమేశ్ (వరంగల్ అర్బన్) 3.కృష్ణ (వనపర్తి). 2000 మీ: 1.వై.రితీశ్ కుమార్ (రంగారెడ్డి), 2.కృష్ణ (వనపర్తి), 3. రక్షిత్ (సూర్యాపేట). అండర్–18 800మీ: 1. దుర్గా రావు (వరంగల్ అర్బన్) 2. హనుమంత నాయక్ (మహబూబాబాద్) 3.ప్రియాన్షు (హైదరాబాద్). 3000మీ: 1.ప్రేమ్ సాగర్ (మంచిర్యాల) 2. శివ (నాగర్ కర్నూల్) 3. రమేశ్ (నాగర్ కర్నూల్). అండర్–20 800మీ: 1. గోíపీ చంద్ (రంగారెడ్డి) 2. వినోద్ నాయక్ (వనపర్తి) 3. వంశీ కృష్ణ. అండర్–14 బాలికల విభాగం: 600 మీ: 1. కీర్తన (నాగర్ కర్నూల్) 2. ఝాన్సీ బాయి (హైదరాబాద్) 3. కల్యాణి (సూర్యాపేట). అండర్–16: 800మీ: 1. శ్రేయ (హైదరాబాద్) 2. ఉమా మహేశ్వరి (సూర్యాపేట) 3. లావణ్య (మహబూబ్‌నగర్). 2000 మీ: 1.సిహెచ్ రాఘవి (హైదరాబాద్) 2. అఖిల (సూర్యాపేట) 3. మల్లిక (యాదాద్రి). అండర్–20: 200మీ: 1. కవిత (కరీంనగర్) 2. సుష్మ (భద్రాద్రి) 3. శ్రావణి (వికారాబాద్). టీం చాంపియన్‌షిప్ విజేతలు ఓవరాల్: ఖమ్మం; బాలుర విభాగం: అండర్– 14: మంచిర్యాల, అండర్– 16: ఖమ్మం; అండర్– 18: వరంగల్ అర్బన్; అండర్– 20: భద్రాద్రి కొత్తగూడెం. బాలికల విభాగం: అండర్– 14: హైదరాబాద్, అండర్– 18: రంగారెడ్డి, అండర్– 20: హైదరాబాద్. -
దివ్యా రెడ్డికి మూడు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాస్టర్స్ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి మూడు స్వర్ణాలతో మెరిసారు. 40 ప్లస్ వయో విభాగంలో పోటీపడిన ఆమె 400, 800,1500 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిలిచారు. 400 మీ. పరుగు పోటీని దివ్య ఒక నిమిషం 22.2 సెకన్లలో పూర్తి చేశారు. ఇందులో కృతి (1ని:30.1 సెకన్లు), ఉమా గుప్తా (1ని:40.5 సె.) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. 800 మీటర్ల విభాగంలో 3 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేశారు. అనంతరం 1500 మీటర్ల పరుగును దివ్య అందరికంటే ముందుగా 7 నిమిషాల 03 సెకన్లలో పూర్తి చేశారు. కృతి (7ని:21.3 సె.)కి రజతం దక్కింది. 45 ప్లస్ వయో విభాగం జరిగిన లాంగ్‌జంప్‌లో కృష్ణవేణి బంగారు పతకం సాధించారు. ఆమె 2.42 మీటర్ల దూరంలో దూకి విజయం సాధించగా, కుసుమ (2.40 మీ.) రజతంతో తృప్తిపడ్డారు. ఇతర పోటీల ఫలితాలు 35 ప్లస్ వయో విభాగం: 100 మీ. పరుగు: 1. ప్రియాంక, 2. సరిత, 3. విజయ; 200 మీ. పరుగు: 1. విజయ, 2. సంధ్య, 3. ఉమ; 1500 మీ. పరుగు: 1. సంధ్య, 2. ఇందు; లాంగ్‌జంప్: 1. ప్రియాంక, 2. విజయ, 3. సమత; షాట్‌పుట్: 1. అశ్విని, 2. ప్రమీల, 3. ప్రియాంక; డిస్కస్ త్రో: 1. ప్రమీల, 2. అశ్విని; 3. కమల; జావెలిన్ త్రో: 1. రోజా, 2. శశిరేఖ, 3. వినీశ; హ్యామర్ త్రో: 1. రోజా, 2.ప్రమీల, 3. శశిరేఖ; 5000 మీ. రేస్‌వాక్: 1. అరుణ, 2. విజయ, 3. జయలక్ష్మి. 40 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1.ఉమా గుప్తా, 2. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. ఉమా గుప్తా, 2. రోజా, 3. శకుంతల; లాంగ్‌జంప్: 1. విజయ, 2. కృష్ణవేణి; షాట్‌పుట్: 1.వర్జినియా బెన్సమ్, 2. షాలిని; డిస్కస్ త్రో: 1. సునీత, 2. కుసుమ, 3.స్వరూప; జావెలిన్ త్రో: 1.ప్రిస్కిలా, 2. మేరి, 3.స్నేహలత; హ్యామర్ త్రో: 1. అల్తియా, 2. ప్రిస్కిలా; 5000 మీ. రేస్‌వాక్: 1. శకుంతల, 2. కృష్ణవేణి, 3. స్నేహలత. 45 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. కృష్ణవేణి; 200 మీ. పరుగు: 1. సుమ, 2. జ్యోతి, 3. తులసి; 1500 మీ. పరుగు: 1. తులసి, 2. జ్యోతి; లాంగ్‌జంప్: 1. కృష్ణవేణి, 2. కుసుమ; షాట్‌పుట్: 1.కుసుమ; షాట్‌పుట్ 50 ప్లస్: 1. భాను; డిస్కస్ త్రో: 1. సునీత, 2. కుసుమ; జావెలిన్ త్రో: 1.సుమ, 2. సునీత; హ్యామర్ త్రో: 1. కుసుమ, 2. సునీత. 50 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1. శాంత, 2. సలోమి; డిస్కస్ త్రో: 1. భాను, 2. అనితారాణి, 3. రూపా ఠాకూర్; జావెలిన్ త్రో: 1. భాను, 2. వరలక్ష్మి; 5000 మీ. రేస్‌వాక్: 1.శాంత, 2. అనితారాణి. 60 ప్లస్ విభాగం: 100 మీ. పరుగు: 1.శారద, 2. దుర్గ; డిస్కస్ త్రో: 1. దేబర, 2. డార్కస్, 3. శారద; జావెలిన్ త్రో: 1. దేబర, 2. డార్కస్; షాట్‌పుట్: 1. దేబర రేమండ్, 2. డార్కస్; 5000 మీ. రేస్‌వాక్: 1. శారద; 70 ప్లస్: 1. దుర్గ. -
అంట్లుతోమే పని నుంచి అంతర్జాతీయ అథ్లెట్ స్థాయికి!
తమిళనాడుకు చెందిన వాసంతీ ఆనందన్ జీవితం ఎందరో అథ్లెట్లకు స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే అంట్లు తోముకునే ఆమె మరో 2 నెలల్లో స్పెయిన్‌లోని మలాగాలో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో 5000 మీటర్ల రన్నింగ్, హాఫ్ మారథాన్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లాలోని తిరువాయూర్ వాసంతి సొంత వూరు. పదేళ్ల క్రితం భర్త ఆనందన్‌తో పాటు తన ఇద్దరు పిల్లలు మణికందన్, కిరుతిక లను వెంటబెట్టుకొని కోయంబత్తూరుకి చేరుకుంది వాసంతి కుటుంబం. 36 ఏళ్ల వాసంతి భర్త ప్రైవేటు బస్ డైవర్. ఇద్దరు పిల్లల పోషణాభారం పంచుకునేందుకు వాసంతి నాలుగిళ్లల్లో గిన్నె లు కడిగే పనికి కుదిరారు. వాసంతి భర్త ఆనంద్‌కూడా రన్నర్ కావడంతో వారి ఇద్దరు పిల్లలకూ రన్నింగ్‌లో శిక్షణనిప్పిస్తున్నారు. రన్నింగ్ శిక్షణ కోసం పిల్లల్ని ప్రతిరోజూ గ్రౌండ్‌కి తీసుకెళ్లి దింపే బాధ్యత వాసంతిది. కోచ్ వైరవనాథన్ వాసంతిని చూడటం తో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. అదే దేశానికి మంచి అథ్లెట్‌ను పరిచయం చేసింది. కోయంబత్తూరులోని నెహ్రూ స్టేడియంలో ప్రతిరోజూ తన పిల్లలను దింపేవారు వాసంతి. సన్నగా ఉన్నా అథ్లెట్‌కి ఉండాల్సిన శరీరాకృతినీ, చురుకుదనాన్నీ వాసంతి లో చూశారు కోచ్ వైరవనాథన్. ఆమె లాంగ్ డిస్టెన్స్ లో బాగా పరిగెత్తగలదని కూడా ఆయన గుర్తించారు. మొదట అదే విషయం ప్రస్తావిం చినప్పుడు వాసంతి ఒప్పుకోలేదు. ఆ తర్వాత గత ఏడాది సమ్మర్ క్యాంప్ సందర్భంగా వంటావార్పూలో వాసంతి సహాయాన్ని కోరడంతో ఆమె క్యాంప్‌కి రావడం మొదలెట్టారు. ఖాళీ సమయంలో వాసంతిని రన్నింగ్‌వైపు ప్రోత్సహించారు కోచ్ వైరవనాథ్. అంతే ఆమె ఇక వెనుదిరిగి చూడలేదు. అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు. భారతీ యార్ వర్సిటీలో మొదట జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తమిళనాడు మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీ ల్లో పాల్గొన్నారు. జాతీయస్థాయిలో మాస్టర్స్ అథ్లె టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీల్లో వరుసగా 5000 మీటర్ల రన్నింగ్‌లో రజత, హాఫ్ మారథాన్‌లో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్‌లో స్పెయిన్‌లో జరగబోయే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు తీవ్రంగా కృషి చేస్తున్నారు వాసంతి. అయితే ఆర్థిక ప్రోత్సాహం లేకపోతే ఒక అథ్లెట్ తీసుకోవాల్సిన ఖరీదైన ఆహారం, మంచి స్పోర్ట్స్ వేర్ ఉండవంటున్నారు. రోజూ 4 గంటలపాటు కోచింగ్ కోసం వెచ్చించాల్సి రావడంతో ప్రస్తుతానికి ఇళ్లల్లో పనిచేయడం మానేసినట్టు వాసంతి మీడియాకి వివరించారు. -
‘ఉత్తమ అథ్లెట్స్’ సాయి కిరణ్, హారిక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సాయి కిరణ్, హారిక సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ‘ఉత్తమ అథ్లెట్స్’గా నిలిచారు. నిజాం కాలేజీకి చెందిన డి. సాయి కిరణ్ 927 పాయింట్లు సాధించగా... డీవీఎం కాలేజీకి చెందిన డి. హారిక 973 పాయింట్లతో నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (41 పాయింట్లు)... మహిళల విభాగంలో వనిత మహావిద్యాలయ (43 పాయింట్లు) ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ అథ్లెట్ పి. శంకర్ విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఇతర పోటీల విజేతల వివరాలు 100మీ. పురుషులు: 1. కె. మహేశ్ (జీసీపీఈ), 2. కె. రాము (జీసీపీఈ), 3. విజయ్ (నిజాం). మహిళలు: 1. హారిక (డీవీఎం), 2. విశాలాక్షి (వనిత), 3. సుజాత (శివాని). 400మీ. పురుషులు: 1. డి. సాయికృష్ణ (నిజాం), 2. సాయి కుమార్ (జీసీపీఈ), 3. రహమాన్ (సెయింట్ జోసెఫ్). మహిళలు: 1.సుస్మిత (నిజాం), 2. బి. సాహితి (లా కాలేజీ), 3. సునీత (నిజాం). 10,000మీ. పురుషులు: 1. బి. రమేశ్ (పీజీ, సికింద్రాబాద్), 2. రంగయ్య (న్యూ బద్రుక), 3. శివానంద్ (అవంతి). మహిళలు: 1. అంకిత (కస్తూర్బా), 2. లావణ్య, 3. తేజస్విని. ట్రిపుల్ జంప్ పురుషులు: 1. వినోద్ కుమార్ (లయోలా), 2. సతీశ్ (నిజాం), 3. ఆర్. వెంకటేశ్ (ఏవీ కాలేజీ). మహిళలు: 1. పి. వీణ (ఏవీ కాలేజీ), 2. హిజ్రత్ (ఓయూ ఆర్ట్స), 3. రవళి (లయోలా). డిస్కస్ త్రో పురుషులు: 1. అంకిత్ (హాజీ గౌజ్ పీఈ), 2. జె. రాజు (నిజాం), 3. లిఖిత్ (భవన్స). మహిళలు: 1. సుమన, 2. సైరీ పాల్ (ఏవీ కాలేజీ), 3. డి. మానస (లయోలా). హ్యామర్ త్రో పురుషులు: 1. కె. అన్వేశ్ (నిజాం), 2. అంకిత్ (హాజీ గౌస్), 3. జి. శ్రవణ్ (లయోలా). మహిళలు: 1. కె. నాగ అనూష, 2. యాస్మిన్, 3. అఖిల. జావెలిన్ త్రో పురుషులు: 1. చార్లెస్ (ఓయూ), 2. ఎం. ప్రకాశ్ (జీసీపీఈ), 3. బి. రమేశ్ (నిజాం). మహిళలు: 1. డి. మానస (లయోలా), 2. రవళి (లయోలా), 3. ఆస్మా (సిద్ధార్థ). 110మీ. హర్డిల్స్ పురుషులు: 1. వి. సాయికుమార్ (శ్రీమేధ), 2. డి. సాయి కిరణ్ (నిజాం), 3. వినోద్ కుమార్ (లయోలా). మహిళలు: 1. విశాలాక్షి (వనిత), 2. హఫీజా (సెయింట్ ఆన్స), 3. మేనిత (ఎంజే ఇంజనీరింగ్ కాలేజీ). 1500మీ. పురుషులు: 1. కె. అనంద్ (జీడీసీఎస్), 2. వి. మారుతి (హాజీ గౌస్), 3. పి. మహిపాల్ (జీసీపీఈ). మహిళలు: 1. ప్రియాంక (వనిత), 2. మానస (కస్తూర్బా), 3. సునీత (నిజాం). 3000మీ. స్టీపుల్ చేజ్ పురుషులు: 1. శ్రీనివాస్ (జీసీపీఈ), 2. బి.రంగయ్య (బద్రుక), 3. బి. ప్రశాంత్. -
ద్రోణాచార్య.. నాగపురి రమేష్
జిల్లాకు తొలిసారిగా దక్కిన గౌరవం హన్మకొండలో పుట్టి పెరిగిన రమేష్ కనీస సౌకర్యాలు లేని రోజుల్లో భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శిష్యులు ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం సాక్షి, హన్మకొండ : వరంగల్ పరుగుల యంత్రం నాగపూరి రమేష్‌కు క్రీడారంగంలో దేశంలో అత్యున్నత పురస్కారమైన ద్రోణాచార్య అవార్డు వరించింది. అథ్లెటిక్స్ విభాగంలో ఇరవై రెండేళ్ల ప్రస్థానంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 29న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జిల్లా నుంచి ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా నాగపూరి రమేష్ గుర్తింపు పొందారు. హన్మకొండ మచిలీబజార్ ఆయన స్వస్థలం కాగా తల్లిదండ్రులు నాగపూరి మల్లయ్య, ఉప్పలమ్మ. వీరికి ఐదుగురు సంతానంలో నాలుగో వాడైన నాగపూరి రమేష్ చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ప్రదర్శించేవారు. అలా జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 1992 నుంచి అథ్లెట్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఇరవై రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడాకారులను సానబెట్టి ఏషియన్, కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. ఒలంపిక్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించింది తక్కువ. ఇందులో నాగపూరి రమేష్ శిక్షణలో రాటుదేలిన సత్తి గీత, ద్యుతిచంద్ ఏథెన్స్, రియోడిజనీరో ఒలింపిక్‌లో పాల్గొనడం విశేషం. భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’ నాగపూరి రమేష్‌ను ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు రమేష్ మాటల్లోనే... నేను పుట్టి పెరిగింది హన్మకొండలోని మచిలీబజార్. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్‌పై ఆసక్తి ఉండేది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న భద్రకాళి గుట్టల వైపు వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత జేఎన్ఎస్ స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. 1985–87 సమయంలో జాతీయ స్థాయిలో జూనియర్ లెవల్లో 3000 మీటర్ల పరుగు పందెం, ఆలిండియా యూనివర్సిటీ పోటీలో చాంపియన్‌గా నిలిచాను. శిక్షకుడిగా.. నేను ఆటగాడిగా ఎదిగే రోజుల్లో రామకృష్ణ సార్ నాకు కోచింగ్ ఇచ్చారు. నా సీనియర్లు సారంగపాణి, ప్రదీప్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్ నుంచి స్ఫూర్తి పొందాను. 1990 తర్వాత తమిళనాడులోని కారైకుడిలో ఎంపీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఇక్కడ నాకు గోల్డ్‌మెడల్ వచ్చింది. దీంతో 1992లో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్స్ కోచ్‌గా త్వరగా ఉద్యోగం వచ్చింది. అలా అథ్లెటిక్ శిక్షకుడిగా నా పరుగు మొదలైంది. విజయ పరంపర.. శిక్షకుడిగా నా ప్రస్థానంలో తొలి విజయం 1996 న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో లభించింది. హన్మకొండకే చెందిన అథ్లెట్ మాధవి లాంగ్‌జంప్‌లో పతకం సాధించింది. దీంతో జాతీయస్థాయిలో కోచింగ్ ఇచ్చే బాధ్యతలు వరించాయి. 2002, 2006, 2010, 2014 వరుసగా నాలుగు ఏషియన్ గేమ్స్‌లో నా శిష్యులు సత్తి గీత, మృదుల, సౌజన్య, మౌనిక, మాధవి 4“400 రిలే పోటీలో బంగారు పతకాలు సాధించారు. 2004, 2008ల్లో ఏథెన్స్, బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో సత్తి గీత ప్రాతినిధ్యం వహించింది. పీఈటీలకు అంకితం.. ఎటువంటి స్వార్థం లేకుండా పని చేసే పీఈటీలు, ఎలాంటి అండదండలు లేని క్రీడాకారులను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలిచే పీఈటీలకు నాకు వచ్చిన ద్రోణాచార్య అవార్డును అంకితం ఇస్తున్నాను. వీరితో పాటు జూనియర్ క్రీడాకారులకు మార్గదర్శులుగా నిలుస్తూ, జూనియర్ల ప్రతిభకు మెరుగులు దిద్దే సీనియర్ క్రీడాకారులకు ఈ అవార్డు అంకితం. శిష్యుల విజయాలనే తమ విజయాలుగా భావించే పీఈటీలు, సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. పీటీ ఉష తర్వాత రమేష్ శిష్యురాలే.. ప్రస్తుతం రియోలో జరుగుతున్న ఒలింపిక్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రమేష్ శిక్షణలో రాటుదేలిన ద్యుతీచంద్ ప్రాతినిధ్యం వహించింది. పీటీ ఉష తర్వాత 32 ఏళ్లకు ఈ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ద్యుతీకి రావడం విశేషం. అయితే, రియోకు క్రీడాకారులను పంపించే సమయంలో ద్యుతీచంద్, రమేష్‌ను ఒకేసారి కాకుండా వేర్వేరుగా పంపించారు. ఒలింపిక్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. అయితే, ఒలింపిక్స్‌లో ద్యుతీ విఫలమైంది. కానీ ద్యుతీ, రమేష్‌ను ఒకేసారి రియోకు పంపిస్తే ఫలితం వేరేగా రావడంతో పాటు సింధు విషయంలో గోపీచంద్‌కు దక్కిన ప్రశంసలే రమేష్‌కు కూడా దక్కేవన్న అభిప్రాయం క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రొఫైల్ పేరు : నాగపురి రమేష్ తల్లిదండ్రులు : ఉప్పలమ్మ–మల్లయ్య స్వస్థలం : మచిలీబజార్, హన్మకొండ భార్య : విద్యుల్లత పిల్లలు : అనూష, సాయిభవిత -
పీసీఐపై వేటు
సస్పెన్షన్ విధించిన ఐపీసీ న్యూఢిల్లీ: గజియాబాద్ ఉదంతం నేపథ్యంలో భారత ప్యారా అథ్లెటిక్ కమిటీ (పీసీఐ)పై అంతర్జాతీయ ప్యారా అథ్లెటిక్ కమిటీ (ఐపీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఈనెల 15న పీసీఐకి మెయిల్ ద్వారా లేఖను పంపింది. అయితే సస్పెన్షన్ ఎంతకాలమనేది స్పష్టం చేయలేదు. ‘గత కొన్నేళ్ల నుంచి పీసీఐలో పరిస్థితి అసలు బాగాలేదు. జాతీయ స్థాయిలో వ్యక్తులు, గ్రూప్‌ల మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు’ అని ఐపీసీ సీఈఓ జేవియర్ గోంజాలెజ్ పేర్కొన్నారు. పీసీఐపై సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. ఐపీసీ తీసుకున్న నిర్ణయం చాలా తీవ్రమైందని పీసీఐ సెక్రటరీ జనరల్ జె.చంద్రశేఖర్ వెల్లడించారు. నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ సభ్యుడు రాజీవ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. గత నెలలో గజియాబాద్‌లో జరిగిన ప్యారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు కోసం వచ్చిన అథ్లెట్లకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సగం నిర్మాణం పూర్తయిన రెండు బిల్డింగ్‌ల్లో నిర్వాహకులు బస ఏర్పాటు చేయడంతో ప్యారా అథ్లెట్లు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సరైన టాయిలెట్స్, తాగడానికి మంచి నీటిని కూడా ఏర్పాటు చేయలేదు. సరైన పరుపులు కూడా లేకపోవడంతో చాలా మంది నేలపైనే పడుకున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై అనేక ఫిర్యాదులు అందడంతో తాజాగా క్రీడాశాఖ చంద్రశేఖర్, తోమర్‌లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.