భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... చింతల్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సాయికిరణ్(30), మంజులలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆటో నడుపుతూ సాయికిరణ్ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంజుల పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన సాయికిరణ్, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.