ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పోలీసుస్టేష న్‌లో పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు నిప్పంటిం చుకున్నాడు.
చెన్నూర్ : ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ పోలీసుస్టేష న్‌లో పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు నిప్పంటిం చుకున్నాడు. బంధువుల కథనం ప్రకారం.. కొత్తగూడెం కాలనీకి చెందిన సాధనబోయిన ప్రవీణ్ సోదరుడు సాయికిరణ్‌కు నెల క్రితం కిష్టంపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపో యాడు.
అదే స్థలంలో గ్రామానికి చెందిన పలువురు దాడిచేసి చంపారని అతని కుటుంబ సభ్యు లు వారం తర్వాత చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రవీణ్ శనివారం రాత్రి పోలీసుస్టేషన్ కు వెళ్లాడు. వెంట తెచ్చుకుని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తీసుకెళ్లారు.