హారర్ నేపథ్యంలో...
సాయికిరణ్, ప్రాచీ అధికారి జంటగా తెరకెక్కిన చిత్రం ‘వలపు సౌధం’. కష్ణమోహన్ దర్శకత్వంలో సునీల్‌సాగర్, మజ్ను సొహ్రాబ్ నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సునీల్ సాగర్ మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఎస్.కె.మజ్ను స్వరపరచిన ఏడు పాటలు శ్రోతలను అలరిస్తాయి’’ అన్నారు. ‘‘నువ్వే కావాలి, ప్రేమించు’ చిత్రాల తర్వాత సాయికిరణ్‌కు ‘వలపు సౌధం’ మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాం. మాజీ మిస్టర్ ఆంధ్ర బల్వాన్ పోలీసాఫీసర్‌గా నటించారు’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: మజ్ను రెహాన బేగం, కె.ఫిష్‌లక్ష్మి, సమర్పణ: పి.విజయ శేఖర్.