ఘంటసాల తర్వాత మా ఫాదర్ వాయిసే... | singer ramakrishna passed away in hyderabad | Sakshi
Sakshi News home page

ఘంటసాల తర్వాత మా ఫాదర్ వాయిసే...

Published Thu, Jul 16 2015 1:31 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఘంటసాల తర్వాత మా ఫాదర్ వాయిసే...

ఘంటసాల తర్వాత మా ఫాదర్ వాయిసే...

హైదరాబాద్ : నాన్నగారు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రముఖ గాయకుడు రామకృష్ణ కుమారుడు, నటుడు సాయికిరణ్ కన్నీటిపర్యంతమయ్యారు. క్యాన్సర్తో రామకృష్ణ గతరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ..'నాన్నగారి భక్తి పాటలు వింటే టెన్షన్ నుంచి రిలీవ్ అయ్యేవాళ్లమని కొన్నివేలమంది చెప్పారు.

భక్తిపాటలు పాడటంలో ఘంటసాల గారి తర్వాత మా ఫాదర్ వాయిసే బాగా సూట్ అవుతుందని చాలామంది అనేవాళ్లని, నాన్నకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉన్నందున  మేం ఏమీ చేయలేకపోయాం. పది నెలలుగా ఆయన చాలా బాధపడ్డారు. ట్రీట్మెంట్ విషయంలో ఒమెగా ఆస్పత్రి వైద్యులు కూడా చాలా సహకరించారు. అయినా ఫలితం లేకపోయింది. నాన్న తరపున నేను చెప్పేదొకటే. మా ఫ్యామిలీకి చిత్ర పరిశ్రమలో మంచి స్థానం ఇచ్చారు. చరిత్రలో నాన్నకు మంచి గాయకుడిగా, నాకు నటుడిగా అవకాశం ఇచ్చింది. మా కుటుంబం తరపున సినీ పరిశ్రమకు ధన్యవాదాలు' అని సాయికిరణ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement