
రామకృష్ణకు ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, సంగీత ప్రియులు, గాయనీ, గాయకులు విచారం వ్యక్తం చేశారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అంజలి ఘటించారు. గాయని ఎస్పీ శైలజ, గాయని సునీత, గాయకుడు, సంగీత దర్శకుడు కుంచె రఘు తదితరులు ...రామకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామకృష్ణ స్మృతులను స్మరించుకుని, ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థించారు.