హైదరాబాద్: అమెరికా ఫ్లోరిడాలో నల్లజాతీయుల కాల్పుల్లో మృతిచెందిన హైదరాబాద్‌వాసి సాయికిరణ్‌గౌడ్ మృతదేహానికి భారత కాలమానం ప్రకారం నేడు పోస్టుమార్టం పూర్తయ్యే అవకాశముందని అమెరికాలో ఉన్న అతని మిత్రుడు మనోజ్ పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు పూర్తి కావడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించనున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున మృతదేహం స్వదేశానికి వచ్చే అవకాశముంది.