పరణీతీ చోప్రా
... అంటున్నారు పరణీతీ చోప్రా. యాక్టర్‌గా ఉండటంలోని ప్లస్‌లు, మైనస్‌లు గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రజల్లో ఉన్న అతి పెద్ద అపోహ ఏంటంటే యాక్టర్స్ ఎప్పుడూ తమ కోపాన్ని ప్రదర్శిస్తారని, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తుంటారని, అందుకే వాళ్లని హ్యాండిల్ చేయటం కష్టం అని. అది నిజం కాదు. యాక్టర్స్ చాలా హంబుల్ పర్సన్స్. పబ్లిక్‌లో కనిపించిన ప్రతిసారి మమల్ని చాలా కళ్లు తీక్షణంగా పరీక్షిస్తుంటాయి. దాని వల్ల మేం ప్రతి పని చాలా కేర్‌ఫుల్‌గా చేస్తుండాల్సి వస్తుంటుంది. కామన్ పీపుల్‌తో పోలిస్తే మాది చాలా డిమాండింగ్ లైఫ్.
ఏదో పార్టీలో ఏదో చేస్తాం. దాన్నే కొన్నిసార్లు స్టేజి మీద చేయండి అంటారు. చాలామంది చూస్తున్నారనో ఇంకేదైనా కారణం వల్లో మేము అది చేయడం కుదరకపోవచ్చు. వెంటనే మాకు యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అనేస్తారు. కామన్ పీపుల్‌తో కంపేర్ చేస్తే యాక్టర్స్‌ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు. అలాగేమా గురించి ఈజీగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఇలాంటివి జరకుండా ఏదైనా మార్గం ఉంటే బావుండు అని అనుకుంటా. ఇక్కడికి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తే తప్ప మా ప్రాబ్లమ్స్ బయటివాళ్లకు అర్థం కావు’’ అని పేర్కొన్నారు పరణీతి.
Comments
Please login to add a commentAdd a comment