Mistrust
-
అపనమ్మకాన్ని తొలగిద్దాం
న్యూఢిల్లీ: కోవిడ్ మహా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధంతో విశ్వవ్యాప్తంగా దేశాల మధ్య వేళ్లూనుకుపోయిన అపనమ్మకాలు, భయాలను పారద్రోలాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ20 సదస్సులో తొలి రోజు అగ్రరాజ్యాధినేతలతో శిఖరాగ్ర చర్చల సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను మోదీ ప్రస్తావించారు. ‘కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు, అపనమ్మకాలు గూడుకట్టుకున్నాయి. వెనువెంటనే వచి్చపడిన ఉక్రెయిన్ యుద్ధ భయాలు ఆ అగాథాలను మరింత పెంచాయి. ఇప్పుడు అపనమ్మకాలను పోగొట్టాల్సిన సమయం వచ్చింది. విశ్వాసం దిశగా ప్రపంచదేశాలు కలిసి నడవాలి. అవిశ్వాసంపై మనం విజయం సాధించాలి. విశ్వ శ్రేయస్సు కోసం కలసి ముందడుగేద్దాం’ అని పిలుపునిచ్చారు. ప్రసంగం ప్రారంభంలోనే మొరాకోను పెను భూకంపం కుదిపేసిన దుర్ఘటనను ప్రస్తావించి వందలాది మంది మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా సహా జీ20 అధినాయకగణం సమక్షంలో మోదీ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే.. ఏటా 100 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందే పెను వాతావరణ మార్పులు సంభవించకుండా ముందస్తు నివారణ చర్యలకు సమాయత్తమవుదాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధన వ్యవస్థల వైపు మారాలంటే ట్రిలియన్ల కొద్దీ భూరి నిధులు అత్యావశ్యకం. ఈ సమూల మార్పు ప్రక్రియలో అభివృద్ధి చెందిన దేశాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించాలి. 2009లో కోపెన్‌హాగెన్‌లో ఐక్యరాజ్యసమితి ‘వాతావరణ’ చర్చల సందర్భంగా 2020 నాటికల్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తామన్న వాగ్దానాలను సంపన్న దేశాలు నిలబెట్టుకోవాల్సిందే. 55 దేశాల ఆఫ్రికన్ కూటమిని జీ20లోకి ఆహ్వానించడం నాకు గర్వకారణం. కోవిడ్ తెచి్చన మహా విషాదం దేశాల మధ్య విశ్వాసం తగ్గించేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతి, ఉత్తరార్థ గోళ దేశాలు, దక్షిణార్ధ గోళ దేశాల మధ్య లోపించిన సఖ్యత, ఆహారం, ఇంధనం, ఎరువులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత అంశాల్లో పరిష్కారాలు వెతికి ప్రపంచ సుస్థిరాభివృద్ధికి సమష్టిగా పాటుపడదాం. ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో సుస్థిరాభివృద్ధి ‘ఒకే కుటుంబం’ స్ఫూర్తితో అభివృద్ధిని సుస్థిరం చేసుకుందాం. దీనిని సాంకేతికత వారధి తోడుగా నిలవనుంది. ప్రతి వర్గం, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సహాయ వ్యవస్థను నిర్మించుకుందాం. అప్పుడే గణనీయమైన మార్పు మహిళల సారథ్యంలో జరిగే అభివృద్ధితోనే 21వ శతాబ్దంలో గణనీయమైన మార్పును చూడగలం. ఇప్పుడు భారత్‌లో సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ విభాగాల్లో పట్టభద్రులైన వారిలో 45 శాతం మంది అమ్మాయిలే. సైన్స్, టెక్నాలజీలో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ అవకాశాలు కలి్పంచేందుకు ‘జీ20 టాలెంట్ వీసా’ అనే ప్రత్యేక కేటగిరీని త్వరలో ప్రారంభిస్తాం. గ్లోబల్ బయో–బ్యాంక్‌లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గ్లోబల్ బయో–బ్యాంక్‌ల ఏర్పాటు సంతోషదాయకం. హృద్రోగాలు, సికెల్ సెల్ అనీమియా, రొమ్ము క్యాన్సర్లపై దృష్టిసారించేందుకు మరింత అవకాశం చిక్కుతుంది. దేశాలను, మనుషులను కేవలం మార్కెట్ల కోణంలో చూడొద్దు. మనకు సహానుభూతి, దీర్ఘకాలిక లక్ష్యాలు తప్పనిసరి. 47 ఏళ్లు కాదు ఆరేళ్లలో సాధించాం ఆర్థిక సమ్మిళితకు 47 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. కానీ దానిని భారత్ కేవలం ఆరేళ్లలోనే సాధించింది. గత పదేళ్లలో ఏకంగా 360 బిలియన్ డాలర్ల మొత్తాలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమచేసింది. 33 బిలియన్ డాలర్ల నిధులు పక్కదారి పట్టకుండా నివారించింది. ఇది స్థూల దేశీయోత్పత్తిలో 1.25 శాతానికి సమానం. మహిళా సాధికారత ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జీ20 ఎంతగానో కృషిచేస్తోంది. అంతర్జాతీయ సరకు రవాణా గొలుసులో విశ్వాసం, పారదర్శకత పెరగాలి. -
యాక్టర్స్‌ని ఎప్పుడూ అపార్ధం చేసుకుంటారు
... అంటున్నారు పరణీతీ చోప్రా. యాక్టర్‌గా ఉండటంలోని ప్లస్‌లు, మైనస్‌లు గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రజల్లో ఉన్న అతి పెద్ద అపోహ ఏంటంటే యాక్టర్స్ ఎప్పుడూ తమ కోపాన్ని ప్రదర్శిస్తారని, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తుంటారని, అందుకే వాళ్లని హ్యాండిల్ చేయటం కష్టం అని. అది నిజం కాదు. యాక్టర్స్ చాలా హంబుల్ పర్సన్స్. పబ్లిక్‌లో కనిపించిన ప్రతిసారి మమల్ని చాలా కళ్లు తీక్షణంగా పరీక్షిస్తుంటాయి. దాని వల్ల మేం ప్రతి పని చాలా కేర్‌ఫుల్‌గా చేస్తుండాల్సి వస్తుంటుంది. కామన్ పీపుల్‌తో పోలిస్తే మాది చాలా డిమాండింగ్ లైఫ్. ఏదో పార్టీలో ఏదో చేస్తాం. దాన్నే కొన్నిసార్లు స్టేజి మీద చేయండి అంటారు. చాలామంది చూస్తున్నారనో ఇంకేదైనా కారణం వల్లో మేము అది చేయడం కుదరకపోవచ్చు. వెంటనే మాకు యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అనేస్తారు. కామన్ పీపుల్‌తో కంపేర్ చేస్తే యాక్టర్స్‌ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు. అలాగేమా గురించి ఈజీగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. ఇలాంటివి జరకుండా ఏదైనా మార్గం ఉంటే బావుండు అని అనుకుంటా. ఇక్కడికి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తే తప్ప మా ప్రాబ్లమ్స్ బయటివాళ్లకు అర్థం కావు’’ అని పేర్కొన్నారు పరణీతి. -
కేడీసీసీపై తమ్ముళ్ల కన్ను
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ)పై తెలుగు తమ్ముళ్లు గురిపెట్టారు. మొన్న అడ్డదారుల్లో జెడ్పీని కైవసం చేసుకున్న టీడీపీ నేతలు నేడు కేడీసీసీ బ్యాంక్‌ను కూడా బలవంతంగా లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు కాంగ్రెస్ డెరైక్టర్లను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దం చేశారు. అయితే ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటంతో తమ్ముళ్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. రేషన్‌షాపులు, పాఠశాలలో మధ్యాహ్నభోజనం నిర్వహణ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శరైతులు వంటి వాటిని అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డమైనదారులు తొక్కుతున్న విషయం తెలిసిందే. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ పీఠాలను దౌర్జన్యంగా దక్కించుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కర్నూలు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాలకవర్గానికి 2013లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో వివిధ సహకార సంఘాల నుంచి 16 మంది డెరైక్టర్లు ఎన్నికయ్యారు. అయితే వీరంతా అప్పట్లో కాంగ్రెస్ మద్దతుదారులే. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 16 మంది, గొర్రెలు, చేనేత సంఘాలు, హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా ఐదుగురు డెరైక్టర్లు కేడీసీసీబీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా కలిసి కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అందుకు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు సహకరించారు. కాంగ్రెస్ నేతల్లో మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. డెరైక్టర్లలో వీరి మద్దతుదారులు కూడా ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ డెరైక్టర్ల చేతనే అవిశ్వాసం పెట్టే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు సమాచారం. డెరైక్టర్లను కొంటున్నారు బ్యాంకు అధ్యక్షురాలు శ్రీదేవిపై డెరైక్టర్ల చేత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఓ మాజీ మంత్రి ద్వారా రంగం సిద్ధమవుతోంది. కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు తేదీ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో అవిశ్వాసంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ మొదలయ్యింది. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక సమావేశం జరపనున్నట్లు చర్చ జరుగుతోంది. ఎవరి బలం ఎంత ఉందో ఆ రోజు తేలిపోనుండటంతో సహకార బ్యాంకు రాజకీయం మరింత వేడెక్కనుంది. డెరైక్టర్లను క్యాంపులకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న నేత సోదరుడు, మాజీ మంత్రి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది డెరైక్టర్ల చేత సంతకాలు కూడా సేకరించినట్లు సమాచారం. మొత్తం 21 మంది డెరైక్టర్లు ఉండగా వారందరినీ క్యాంపునకు తరలించేందుకు మాజీ మంత్రి ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. -
టీఆర్ఎస్ వైపు డీసీసీబీ డెరైక్టర్ల చూపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సమసి పోయిందనుకుంటున్న డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అంశం ఇంకా రగులుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు డెరైక్టర్లు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా తూర్పు జిల్లాకు చెందిన ఈ డెరైక్టర్లు త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో చైర్మన్ దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. తనపై పొంచి ఉన్న ‘అవిశ్వాస’ గండం నుంచి గట్టెక్కేందుకు ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపే ఈ భారీ మార్పులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వరుస ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రైతులకు సంబంధించిన సహకార రంగంపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. డెరైక్టర్లలో నిర్లిప్తత డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై కొందరు డెరైక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. తాము డెరైక్టర్లుగా ఎన్నికైనప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. నిధులు, నిర్ణయాల్లో తాము నిమిత్తమాత్రులగా ఉన్నామని నిర్లిప్తతో ఉన్నారు. డీసీసీబీ సమావేశాలకు హాజరు కావడం, ప్రయాణ భత్యాలు తీసుకుని వెళ్లిపోవడానికే పరిమితమవుతున్నామనే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సర్కారు మారడంతో డీసీసీబీ చైర్మన్ పదవిపై అవిశ్వాస అంశం తెరపైకి వచ్చింది. డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఈ అసంతృప్త డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేశారు. కొందరు డెరైక్టర్లతో క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు దామోదర్‌రెడ్డి జాగ్రత్త పడి 14 డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. గత నెల 27న నిర్మల్ మండలం మంజులాపూర్ సొసైటీలో ఈ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, డెరైక్టర్ల మద్దతు తనకు ఉందని దామోదర్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఈ అవిశ్వాస అంశం ఇంకా రగులుతూనే ఉండటంతో దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.