
పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్
ఇక్కడ ఉన్న ఫోటో చూశారుగా! హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ పరిణీతి చోప్రా ట్రైన్‌లో ఉన్నారని అర్థం అయ్యే ఉంటుంది. ట్రైన్ పేరు చెప్పడం కష్టం కానీ... ఎక్కడో చెప్పగలం. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? అంటే.. పారిపోతున్నారట. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’.
ఈ సినిమా షూటింగ్‌ను ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిపారు. విలన్స్ నుంచి అర్జున్, పరిణీతి చోప్రా పారిపోయే సీన్స్‌ను తెరకెక్కించారు చిత్రబృందం. జారుకో.. జారుకో.. జల్దీ జారుకోవాలె అని అక్కడి నుంచి ఉడాయించింది ఈ జంట. అది సరే కానీ విలన్స్‌ను రఫ్ఫాడించకుండా హీరో పారిపోవడం ఏంటీ? అంటే.. ఉంది బాస్.. దానికి రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment