ముంబై : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ స్టన్నింగ్ పర్ఫామెన్స్‌తో అదరగొడతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్న రణ్‌వీర్ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని అతడి మేనేజర్ తెలిపారు. డాన్స్ చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో రణ్‌వీర్ ఈ వేడుకకు దూరమయ్యాడని వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం గుల్లీ బాయ్ షూటింగ్‌లో యథావిధిగా పాల్గొననున్నారు. రణ్‌వీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింబాతో పాటు, "83" సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
రణ్‌వీర్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. గాయం కారణంగా రణ్‌వీర్ దూరమవడంతో హృతిక్ రోషన్‌ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఈనెల 7న ముంబైలో జరిగే వేడుకల్లో పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు ప్రదర్శన ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్‌కు విరామం ఇచ్చిన వరుణ్ అప్పుడే రిహార్సల్ కూడా మొదలుపెట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment