ముంబయి : ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పరిణీత చోప్రా కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె లేటెస్ట్ గోల్‌మాల్ అగెయిన్. ఆ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఆమె తన అభిమానం చాటుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. రోహిత్ ఛాన్సిస్తే ఆయన ప్రతి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నటీనటులతో పాటు సిబ్బందిని రోహిత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని, అందుకే రోహిత్ అంటే తనకెంతో గౌరవమని పరిణీతి చోప్రా అన్నట్లు సమాచారం.
అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కరీనా కపూర్‌లు గోల్‌మాల్ ఫ్రాంచైజీలతో సందడి చేశారు. ప్రస్తుతం తనకు గోల్‌మాల్ లేటెస్ట్ మూవీలో నటించే అవకాశం కారణంగా సంబరాలు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. రోహిత్ తెరకెక్కించే సినిమాల్లో పనిచేయాలన్నది పరిణీతి కోరిక. అలాంటిది రోహిత్ 'గోల్‌మాల్ అగెయిన్'లో ప్రధానపాత్ర ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా పరిణీతి భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గోల్‌మాల్ తాజా సిరీస్ షూటింగ్ ముగియడంతో పరిణీతి ఏదో కోల్పోయినట్లుగా కాస్త దిగాలుగా కనిపిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment