Published
Wed, Mar 19 2014 12:12 AM
| Last Updated on Sat, Sep 29 2018 5:17 PM
‘దృశ్యం’ మొదలైంది
వెంకటేశ్ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలైనా విడుదలయ్యేలా ప్లాన్ చేశారాయన. అందుకు తగ్గట్టుగానే అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు సినిమాలూ రీమేక్‌లే కావడం విశేషం. వాటిల్లో మలయాళం ‘దృశ్యం’ రీమేక్ ఒకటి. ఇప్పటికే కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అత్యధిక భాగం చిత్రీకరణ కేరళలోనే జరుగుతుందట. మాతృకలో కథానాయికగా నటించిన మీనానే తెలుగులోనూ హీరోయిన్. కథలో కీలకమైన పోలీసాఫీసర్‌గా నదియా కనిపిస్తారు. శ్రీప్రియ దర్శకురాలు. తెలుగులోనూ ‘దృశ్యం’ టైటిల్‌నే ఖరారు చేస్తారా? లేక కొత్త టైటిల్ నిర్ణయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక హిందీ చిత్రం ‘ఓ మైగాడ్’ రీమేక్ అయితే... ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.