ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్ | Kamal Haasan's 'Drishyam' to roll from August | Sakshi
Sakshi News home page

ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్

Published Sat, Jul 19 2014 12:27 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్ - Sakshi

ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్

మళయాళం, కన్నడంతో పాటు తెలుగులో కూడా హిట్టయిన 'దృశ్యం' చిత్రం మరోసారి షూటింగ్ జరుపుకోబోతోంది. విభిన్న చిత్రాలకు ఎప్పుడూ పెద్దపీట వేసే కమల్ హాసన్ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నారు. ఈ షూటింగ్ ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభం అవుతోంది. తెలుగు, మళయాళం రెండు భాషల్లోనూ హీరోయిన్గా చేసిన మీనానే తమిళంలోకి కూడా తీసుకున్నారు.

కమల్తో పాటు చిత్రానికి సంబంధించిన మరికొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఈ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు తొలివారం నుంచి మొదలవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. మళయాళం సినిమాలో ప్రధానపాత్ర పోషించిన జీతు జోసెఫ్ తమిళ సినిమాలోనూ చేస్తున్నారు. సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వరూపం2, ఉత్తమవిలన్ చిత్రాల తర్వాత కమల్తో ఆయన చేస్తున్న మూడో సినిమా దృశ్యం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement