ఆగస్టు నుంచి 'దృశ్యం' సినిమా షూటింగ్
మళయాళం, కన్నడంతో పాటు తెలుగులో కూడా హిట్టయిన 'దృశ్యం' చిత్రం మరోసారి షూటింగ్ జరుపుకోబోతోంది. విభిన్న చిత్రాలకు ఎప్పుడూ పెద్దపీట వేసే కమల్ హాసన్ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నారు. ఈ షూటింగ్ ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభం అవుతోంది. తెలుగు, మళయాళం రెండు భాషల్లోనూ హీరోయిన్గా చేసిన మీనానే తమిళంలోకి కూడా తీసుకున్నారు.
కమల్‌తో పాటు చిత్రానికి సంబంధించిన మరికొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఈ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆగస్టు తొలివారం నుంచి మొదలవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. మళయాళం సినిమాలో ప్రధానపాత్ర పోషించిన జీతు జోసెఫ్ తమిళ సినిమాలోనూ చేస్తున్నారు. సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వరూపం2, ఉత్తమవిలన్ చిత్రాల తర్వాత కమల్‌తో ఆయన చేస్తున్న మూడో సినిమా దృశ్యం అవుతుంది.