సాక్షి, హైదరాబాద్: సక్సెస్‌ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్)
దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్‌గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్‌గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!)
Comments
Please login to add a commentAdd a comment