Liver disease
-
మా ఇంటి ‘మహాలక్ష్మి’ని నిలబెట్టండి..
టేకుమట్ల: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వారి కూతురు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా పెద్దరోగం వచి్చందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దండ్రె రమేశ్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మహాలక్ష్మి నెల రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో వివిధ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చివరకు ఆ బాలికకు ‘డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్’అని డాక్టర్లు తేల్చడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అందినకాడ అప్పు చేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.22 లక్షల మేర ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో ఆ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కూలీ పని చేసుకుని జీవించే తమ బతుకుల్లో పెద్దకష్టం వచి్చందని, పాపకు వైద్యం చేయించేందుకు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు ఈ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని (97013 29434) కోరుతున్నారు. -
ప్రాణదానం చేసి.. ప్రాణాలు విడిచింది
బొమ్మనహళ్లి: ఓ మహిళ సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలుస్తారు. అదే మాదిరిగా బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసును చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన బెంగళూరులో జరిగింది. మృతురాలు అర్చనా కామత్ (34).బంధువుకు బాగా లేదంటే..వివరాలు.. ఉడుపికి చెందిన అర్చనా కామత్ మంగళూరులో ఓ మేనేజ్మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. తమ బంధువైన వృద్ధురాలు (69)కి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేకమందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్ గ్రూప్‌తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది. 12 రోజుల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు శస్త్రచికిత్స చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండురోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్ కామత్ తో పాటు నాలుగేళ్ల తనయుడు ఉన్నారు. ఆమె లివర్‌ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం. -
కామెర్ల వ్యాధి రకాలు: లివర్ని కాపాడే బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మన బాడీలో పవర్ హౌస్ లివర్. లివర్ పనితీరు దెబ్బ తింటే అనే అనారోగ్యాల బారిన పడతాం. కాలేయం దెబ్బతింటే వచ్చే కామెర్ల వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రం ఈ వ్యాధిని నిర్ణయిస్తారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా చికిత్స ఉంటుంది. ప్రీహెపాటిక్: రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరిగితే, దానిని ప్రీహెపాటిక్ కామెర్లు అంటారు. హెపాటిక్ : కాలేయం బిలిరుబిన్ను ఉత్పత్తి చేయలేకపోతే దానిని హెపాటిక్ కామెర్లు అంటారు. పోస్ట్థెపాటిక్: బిలిరుబిన్ పేరుకుపోవడం, శరీరం తొలగించలేకపోవడాన్ని పోస్ట్థెపాటిక్ కామెర్లు అంటారు. అబ్స్ట్రక్టివ్:.పాంక్రియాటిక్ వాహిక మూసుకుపోయినపుడు వచ్చిన కామెర్లను అబ్స్ట్రక్టివ్ కామెర్లుగా పిలుస్తారు. నవజాత శిశువులు కూడా జాండిస్ బారిన పడతారు. దీనికి ‘ఫోటోథెరపీ’ ట్రీట్మెంట్ ద్వారా నయం చేస్తారు లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. టీ: బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల లివర్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది లివర్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. రోజూ ఒక కప్పు కాఫీ తీసుకున్నా మంచిదే. టోఫు : సోయాతో తయాయ్యే టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయా బీన్స్‌తో సొయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు : ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, ద్రాక్ష వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ , నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా బీన్స్, గింజలు వంటివి కూడా తీసుకో వచ్చు. విటమిన్-ఇ సమృద్ధిగా నట్స్‌తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. కూరగాయలు : బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర కూరలతో లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుండి కూడా బయట పడొచ్చు. పాలకూర వంటి వాటిలో గ్లూటాతియోన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నోట్: లక్షణాలు చూసి బయపడిపోకుండా, వైద్యులను సంప్రదించి, రక్త, మూత్రం, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మద్య పానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. -
ఆల్కహాల్ తాగని వారిలోనూ లివర్ సమస్యలు.. అదొక్కటే పరిష్కారం
కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చదివేద్దాం. మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం దాపురించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్ సిర్రోసిస్ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు, ఆల్కాహాల్ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సి, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిర్రోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్ ఫంక్షన్లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు. 40ఏళ్లు దాటితే.. శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్ ఎక్కువగా ఉన్న జంక్ఫుడ్స్ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. లివర్ వ్యాధులకు కారణాలివే... శ్రమ లేని జీవన విధానం ఆహారపు అలవాట్లు పెరుగుతున్న మధుమేహులు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ వ్యసనం ఫాటీ లివర్‌ను అశ్రద్ధ చేయొద్దు పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు ఏడాదికోసారి పరీక్షలు తప్పనిసరి వీటికి దూరంగా ఉండాలి ►మంచి పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ► మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది. ► కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు. ► చేపలు, అవిసె గింజలు, అక్రోట్లు,పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి. ► చక్కెర ఎక్కువగా ఉండే కూల్డ్రింకులు, పానీయాలకు దూరంగా ఉండాలి. ► ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు. ఇవి పాటిస్తున్నారా? వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకడోస్‌లు ఎక్కువగా తీసుకోవడం మంచిది నీరు ఎక్కువ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు,గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో కాలేయ సమస్యలతో వస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఆల్కహాల్ తాగే వారిలోనే లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకేది. కానీ ఇప్పుడు కొలస్ట్రాల్ కారణంగా నాన్ ఆల్కహాలిస్టుల్లో కూడా సిర్రోసిస్ చూస్తున్నాం. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు, ఆహార నియమాలు పాటిస్తూ, శరీరంలో కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. – డాక్టర్ బీఎస్వీవీ రత్నగిరి, అసోసియేట్ ప్రొఫెసర్, గాస్ట్రో ఎంట్రాలజీ -
బాలిక లివర్ మార్పిడికి సీఎం సహాయ నిధి సాయం
కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు, హరూన్ గ్రూప్ సంస్థల ఎండీ ఎస్బి అహ్మద్‌బాషా పేర్కొన్నారు. ఆదివారం ఆయన కడప నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక సయ్యద్ షబానా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సీఎం సహాయ ని«ధి నుంచి మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి అందజేశారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సయ్యద్ షబానా చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారని చెప్పారు. అంత ఖర్చు భరించలేని బాలిక కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాను ఆశ్రయించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స వ్యయం రూ.17.50 లక్షలు మంజూరు చేయించారన్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేనందున ఎల్ఓసీ పత్రాన్ని బాలిక కుటుంబానికి తాను అందిస్తున్నట్లు వివరించారు. షబానా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తన లివర్‌ను దానం చేస్తున్న బాధితురాలి తల్లితోపాటు శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. -
పసి ప్రాణానికి అండగా ‘సీఎం సహాయనిధి’.. రూ.10 లక్షలు మంజూరు
గన్నవరం రూరల్: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండగా నిలిచింది. గంటల వ్యవధిలోనే ఆపరేషన్‌కు అవసరమైన రూ.10 లక్షలు మంజూరు కావడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన మెట్లపల్లి రాఘవరావు వ్యవసాయ కూలీ. అతని భార్య నాగలక్ష్మి గృహిణి. వీరికి గతేడాది నవంబర్ 6న మగబిడ్డ జన్మించాడు. అయితే బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించి చివరికి హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, రూ.10 లక్షలకు పైగానే ఖర్చవుతుందని, వెంటనే చేయకపోతే ప్రమాదమని చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఇక చేసేది లేక చంటి బిడ్డతో ఇంటికి తిరిగొచ్చేశారు. సోమవారం గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామ వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రూ.10 లక్షలు మంజూరు వైఎస్సార్సీపీ నేతలు బాలుడి విషయాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెయిన్బో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి చిన్నారి చికిత్సకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వివరాలు పంపి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. కేవలం గంటల వ్యవధిలో చిన్నారి చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు కావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంజూరైన రూ.10 లక్షల చెక్కును బుధవారం వీరపనేనిగూడెం గ్రామ సచివాలయంలో వైఎస్సార్సీపీ నేతలు మేచినేని బాబు, పడమట సురేష్, కైలే శివకుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌రాణి, సర్పంచ్ జేజమ్మ, ఎంపీటీసీ పద్మావతి, ఉప సర్పంచ్ నాగసాంబిరెడ్డి, సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు బాధిత కుటుంబానికి అందించారు. -
ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు నిషికాంత్. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్ గానూ కనిపించారాయన. -
ఆస్పత్రిలో 'దృశ్యం' దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: సక్సెస్ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్) దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్‌గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్‌గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!) -
కాలేయం చెడిపోయి.. పాపం.. పసిప్రాణం
ఎనిమిదేళ్ల చిన్నారి కాలేయ వ్యాధితో మంచానికే పరిమితమైంది. కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పసిప్రాణం అల్లాడుతోంది. ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో ఆ బిడ్డ మంచానికే పరిమితమైంది. 15 రోజుల్లో కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని వైద్యులు తేల్చిచెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. చికిత్సకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని అర్థిస్తున్నారు. తిరుపతి తుడా : స్థానిక గోవిందనగర్ (రెండుమద్దిమాన్లు)లో కాపురం ఉంటున్న కె.మునెమ్మ, కె.సత్యనాగరాజు దంపతులకు కె. జోత్స్న(8) ఏకైక కుమార్తె. తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్‌లో రూ.7వేల వేతనంతో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తూ సత్యనాగరాజు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోత్స్న అనారోగ్యం బారిన పడడంతో ఆస్పత్రిలో చూపించారు. కామెర్లు అని తేల్చి వైద్యులు చికిత్స చేశారు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. రుయా వైద్యుల సూచన మేరకు చెన్నైలోని ఎగ్మోర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు చేసిన చికిత్సతో కొంతవరకు జోత్స్న కోలుకోవడంతో తిరిగి వచ్చారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. మళ్లీ సమస్య తిరగబెట్టడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో లివర్ ఫెయిల్యూర్ అని ధ్రువీకరించారు. హుటాహుటిన చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో 15రోజుల్లోపు కాలేయ మార్పిడి చేస్తేనే బిడ్డ బతుకుతుందని తేల్చి చెప్పడంతో హతాశులయ్యారు. తన కుమార్తెను బతికించేకునేందుకు కాలేయదానం చేయడానికి సత్య నాగరాజు ముందుకొచ్చాడు. అయితే మార్పిడికి మాత్రమే రూ. 19.50 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో దిక్కు తోచలేదు. తమకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతలు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. మరోవైపు జోత్స్న ఉదర భాగం రోజు రోజుకూ ఉబ్బిపోతుండంతో దిక్కుతోచని స్థితిలో సాక్షికి తమ గోడు నివేదించారు. దాతలు ఎవరైనా సాయం చేయదలిస్తే...బాధితురాలి తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు: కె. సత్యనాగరాజు, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 20219069477, ఐఎఫ్‌సీ కోడ్ ఎస్బీఐఎన్ 000610, ఎస్బీఐ టీటీడీ ఏడీ బిల్డింగ్ బ్రాంచ్. -
‘దశమూలారిష్టం’తో అరిష్టం కూడా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా రోగి ఓ రైతు. ఆయనకు 40 ఏళ్లు. పచ్చ కామర్లతో (క్రానిక్ జాండీస్)తో బాధ పడుతున్న ఆయన ఓ రోజు చికిత్స కోసం నా వద్దకు వచ్చారు. ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా బైల్‌రూబిన్ లెవల్స్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక కాలేయం ఎంజైమ్స్ ఉండాల్సిన దానికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ పరీక్షలు ఆయన మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడనే తెలిపాయి. అయితే ఆ రోగి మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. తాను జీవితం ఒక్క చుక్క కూడా మద్యం ముట్టుకోలేదని వాదించారు. ఆయన మరీ లావుగానీ, బక్కగాగానీ లేకుండా దృఢంగా ఉన్నారు. కాలేయ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఆయనపై వివిధ రకాల వైరస్లు, బయాటిక్ పరీక్షలు నిర్వహించాం. అన్నీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అరుదైన క్యాన్సర్ పరీక్షలూ నిర్వహించాం. అయినా నెగటివ్ ఫలితాలే వచ్చాయి. రోజు రోజుకు రోగికి జాండీస్ జబ్బు పెరుగుతోంది. బయాప్సీ చేయాలని నిర్ణయించాను. ఒక్క క్యాన్సర్లకే కాకుండా జబ్బుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఈ బయాప్సీ ఉపయోగ పడుతుంది. రోగి అంగీకారంతో బయాప్సీ పరీక్ష నిర్వహించాం. అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ‘సీవియర్ ఆల్కహాలిక్ హెపటైటీస్’ ఉందని ఆ పరీక్షలో తేలింది. దాదాపు ప్రతిరోజు అతిగా తాగేవాళ్లకే ఈ జబ్బు వస్తుంది. రోగిని పిలిచి తిట్టాను నిజం చెప్పమని. తాను నిజమే చెబుతున్నానని, అబద్ధం చెప్పడం లేదని అన్నారు. లాభం లేదనుకొని ఆయన భార్య, కూతుళ్లను పిలిపించి వారిని ప్రశ్నించాను. రోగికి ఎప్పుడు కూడా మద్యం అలవాటు లేదని, తామంతా మూడు పూటలా కలిసే తింటామని, రాత్రిపూట కలిసే ఉంటామని వారు చెప్పారు. ఇంకా ఏమీ అలవాట్లు ఉన్నాయిని ప్రశ్నించాను. తిన్నాక రెండు పూటల తిన్నది అరిగేందుకు ఆయుర్వేదం మందు తాగుతారని ఆయన భార్య తెలిపింది. ‘దశమూలారిష్టం’ తీసుకుంటానని రోగి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అది కేరళలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ మంది అన్నం జీర్ణం అయ్యేందుకే దాన్ని వాడుతుంటారు. దాన్ని 30 వన మూలికలతో తయారు చేస్తారు. అందులో ‘వుడ్ఫోర్డియా ఫ్రూటికోసా’ అని పువ్వులు కూడా కలుపుతారు. వాటిని మురగబెడితే ద్రాక్షలాగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆల్కహాలే జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా తోడ్పడుతుంది. కొంత మంది వైద్యులు ఆ పువ్వులు త్వరగా కుళ్లడానికి బ్రెడ్డులో వాడే బేకింగ్ పౌడర్‌ను వాడుతారు. మరికొందరు వైద్యులు నేరుగా ఆల్కహాలును కలిపి ఔషధాన్ని తయారు చేస్తున్నారు. కేరళలో మద్యపానంపై నిషేధం ఉండడం వల్ల ‘దశమమూలారిష్టం’ను ఎక్కువగా వాడుతున్నారని తోటి వైద్యుల ద్వారా తెల్సింది. అన్నం జీర్ణం కోసం వాడే వాళ్లు దీన్ని రోజుకు నాలుగుసార్లు వాడుతుండగా, మద్యం అలవాటున్నవాళ్లు ఎక్కువగా తాగుతున్నారని తెల్సింది. నాలుగు సార్లు తీసుకునే మందులో 35 గ్రాముల ఆల్కహాలు ఉంటుంది. ఆ మందులో మొత్తం ఆల్కహాలు శాతం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది. కాలేయ వ్యాధి రావడానికి ఆ మాత్రం ఆల్కహాలు చాలు కనుక ఈ ఔషధం కారణంగా నా రోగికి కాలేయ వ్యాధి వచ్చిందని తెల్సి ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. నా రోగిలో ఆల్కహాలిక్స్‌లో ఉండని లివర్‌ను దెబ్బతీసే ‘నెక్రోసిస్’ కూడా ఉందని మా ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా తెల్సింది. నా రోగిని పిలిపించి ఇంకా ఏమేమి తాగుతావని అడిగాను. తన తోటలో పండించే పైనాపిల్ జ్యూస్ రోజు తాగుతానని చెప్పారు. ఆయన తినే పైనాపిల్స్‌ను తెప్పించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించాం. వాటిల్లో ‘నికల్ టెట్రాకార్బనిల్’, అసెటిల్ పెంటాకార్బనిల్, కార్బామిక్ ఆసిడ్స్’ ఉన్నాయని తేలింది. ఎరువులు ఎక్కువగా వాడడంలో అవి అందులోకి వచ్చాయి. నా రోగికి ‘టాక్సిక్ హెపటైటీస్’ కూడా ఉంది కనుక, అది పైనాపిల్స్ వల్ల వచ్చిందని తేలింది. ట్రీట్మెంట్తో రోగి పూర్తిగా కోలుకున్నాడు. (కొచ్చీలోని ఈఎంసీ హాస్పిటల్‌కు అనుబంధమైన ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్’లో స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ‘ది అమెరికన్ జనరల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ’ తాజా సంచికలో రాసిన వ్యాసానికి అనువాదం) -
కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి తల్లి జన్మనిస్తే... తండ్రి పునర్జన్మను ప్రసాదించాడు. దీనికినగరంలోని నిమ్స్ ఆస్పత్రి వేదికైంది. ఆ బాలుడి పేరు శశికిరణ్. ఆయన తండ్రి ఉప్పలయ్య. లివర్ సిరోసిస్ (కాలేయం పనితీరు దెబ్బతినడం)తో బాధపడుతున్న కుమారుడికి కాలేయం దానం చేసిన ఉప్పలయ్య ఫాదర్ ఆఫ్ శశికిరణ్ అనిపించుకున్నారు. అందరి మన్ననలుఅందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలోనే తొలి లైవ్ లివర్ట్రాన్స్ప్లాంటేషన్గా ఇది నిలిచిపోయింది. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఈ చికిత్సవివరాలను సోమవారం ఆస్పత్రిలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం విడవల్లి గ్రామానికి చెందిన పోలియో బాధితుడు దొంతగాని ఉప్పలయ్య టైలర్. ఈయన కుమారుడు మాస్టర్ శశికిరణ్(14) కామెర్లతో బాధపడగా, ఏడాది క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్ప వైద్య పరీక్షలు నిర్వహించి, బాలుడు లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ మేరకు జీవన్‌దాన్ సహా ఆరోగ్యశ్రీలోనూ పేరు నమోదు చేయించారు. అయితే బ్రెయిన్‌డెడ్ దాత కాలేయం లభించకపోవడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని కుమారుడికి ఇచ్చేందుకు ఉప్పలయ్య ముందుకొచ్చారు. 30 రోజులు... 8 కిలోలు వైద్యులు ఉప్పలయ్యకు పరీక్షలు నిర్వహించగా, ఆయన ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కాలేయంలో కొవ్వు కరిగిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత చికిత్స చేయాలని వైద్యులు భావించారు. దీంతో వ్యాయామం చేయాలని సూచించారు. కుమారుడిపై ప్రేమతో ఉప్పలయ్య నెల రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గాడు. జూన్ 4న డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్యబృందం 12గంటలు శ్రమించి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు. ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్ ఫర్ లివర్ సైన్సెన్ (యూకే) డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య సహకారం అందించారు. ‘సర్కారీ’లో తొలిసారి... జీవన్‌దాన్ పథకంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు బ్రెయిన్‌డెడ్ డోనర్ నుంచి సేకరించిన కాలేయ మార్పిడి చికిత్సలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా లైవ్ డోనర్ కాలేయ మార్పిడి చికిత్స జరగడం విశేషం. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుంటే.. ఆరోగ్యశ్రీ సహకారంతో నిమ్స్‌లో కేవలం రూ.10.80 లక్షలకే చేసినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో డాక్టర్లు పద్మజ, వేణుమాధవ్, సూర్యరామచంద్రవర్మ, నవకిషోర్, జగన్‌మెహన్‌రెడ్డి, గంగాధర్, దిగ్విజయ్, అభిజిత్, హితేష్, వికాశ్, నిర్మల, మధులిక, ఇందిరా, కవిత పాల్గొన్నారు. 11వేల సర్జరీలు... ఆస్పత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో ఈ మూడేళ్ల కాలంలో సర్జరీలు రెట్టింపయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా 7వేల సర్జరీలు జరిగితే... 2017లో 13వేలకు పైగా సర్జరీలు నిర్వహించగా, ఈ ఏడాది ఇప్పటికే 11వేల సర్జరీలు చేశాం. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఏడుగురు బాధితులు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా కిడ్నీమార్పిడి చికిత్సలు నిర్వహించాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
కాలేయ వ్యాధితో బాధపడే బాలికకు మాస్టర్ మైండ్స్ సాయం
-
ఎలా బతికించుకునేదీ..!
తొలి ప్రసవంలోనే మగ బిడ్డ పుట్టడంతోఆ దంపతుల్లో సంతోషం పెల్లుబికింది...మలి ప్రసవంలో ఆడబిడ్డ...ఇక చాలనుకున్నారుసంసార బండి సాఫీగా సాగుతుందనుకున్నారుఅంతలోనే పిడుగులాంటి వార్త... తొలిబిడ్డలో కాలేయం దెబ్బతిందని...ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగానేమరో బిడ్డకూ అదే వ్యాధి...ఇద్దరు బిడ్డలకూ అనారోగ్యం వెంటాడడంతోమరో బిడ్డని కన్నారు ... ఆ బిడ్డకూ అదే జబ్బుకూలీ, నాలీ చేసిన డబ్బులతోముగ్గురినీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు లక్షల ఖర్చు... అక్కరకు రాని ఆరోగ్య శ్రీ...అంతలోనే ఆరోగ్య శాఖా మంత్రి రాకతోఎంతో ఆశతో ఆశ్రయించారు...అయన మాటలతో కుంగిపోయారు...సాయం మాటెలా ఉన్నా ...ఆయనేం మంత్రి...కడుపు పంటపైనే కడుపు మంటా దక్కే బిడ్డకోసం ముగుర్ని కంటేఇంత అపహాస్యమా...ఆదుకోవాలని అర్ధిస్తేఇంత అసహనమా...! కాకినాడ రూరల్: మట్టిపనికి వెళ్తేనే అన్నం కుండ పొయ్యెక్కేది ... పూట గడిచేది. ఉన్నదాంట్లోనే గుట్టుగా బతికే కుటుంబంలో ఓ మాయదారి రోగం ఆ సంసారాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆ కన్నపేగుల్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. చివరకు జిల్లా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రతిఫలం కనిపించడం లేదు. ఎవరైనా సాయం చేద్దామన్నా ఒకటి, రెండు వేలల్లో అయిపోయే జబ్బు కాదు. దీంతో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ప్రజావాణికి ముగ్గురు చిన్నారులను వెంటపెట్టుకొని ప్రాధేయపడిన ఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన అమర్తి చిన్న, వెంకన్నలు భార్యాభర్తలు. వీరికి దుర్గాప్రసాద్ (7), లక్ష్మి (4), మార్త (2) ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు దుర్గాప్రసాద్ పుట్టిన మూడేళ్లకు ఒంట్లో బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలేయ వ్యాధి సోకిందని, దీనికి దాదాపుగా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. తరువాత మరో అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికీ అదే జబ్బుండడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకరుకాకపోతేమరొకరైనా బాగుంటారన్న ఆశతో మరో అమ్మాయికి జన్మనిచ్చిన ఆ తల్లికి మూడో బిడ్డ కు కూడా అదే వ్యాధి ఉందని తెలిసి కుప్పకూలిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం, సామర్లకోట, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో తిరగని ఆసుపత్రి లేదు. ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆపరేషన్లు చేయించాలంటే సుమారు రూ. కోటి వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారని ఆ తల్లిదండ్రులు వాపోయారు. మంత్రి వ్యాఖ్యలతో... ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చడంతో నాలుగు రోజుల కిందట కాకినాడ వ చ్చిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావును తమ పిల్లలతో వెళ్లి సమస్యను వివరించారు. దయ చూపించాల్సిన ఆ మంత్రి ‘తొలి బిడ్డకు జబ్బు ఉందని తెలి సి వరుసగా ఇద్దరు బిడ్డలను ఎందుకు కన్నావ’ని ఛీదరించుకున్నారని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జబ్బు ఉంది ... ఏదో ఓ బిడ్డ బతికి వంశాన్ని నిలబెడతారని కన్నాం... బాధను అర్ధం చేసుకోకుండా మంత్రి కామినేని అన్న మాటలకు అక్కడే బిడ్డలతో కలసి చనిపోవాలనిపించింద’ని ఆ తల్లి ‘సాక్షి’తో చెబుతూ బోరున విలపించింది. కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలసి తమ సమస్యను వివరించినా ‘ఈ సమ స్య ఇక్కడ పరిష్కారం కాదని చెప్పా’రంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాతలు ముందు కు వచ్చి తమ బిడ్డలను కాపాడా’లంటూ ఆ భార్యా, భర్తలు వేడుకుంటున్నారు. -
నన్ను బతికించండి
-
కాలేయ జబ్బుల నివారణకు కొత్త మందులు
- గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ చంద్రశేఖరన్ కర్నూలు(హాస్పిటల్): హెపటైటిస్-బి, సి తదితర కాలేయ వ్యాధుల నివారణకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చినట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖరన్(చెన్నై) చెప్పారు. స్థానిక బళ్లారి చౌరస్తా సూరజ్‌గ్రాండ్ హోటల్లో ఆదివారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి ఏపీ చాప్టర్ ఏర్పాటును ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా డాక్టర్ బి. శంకరశర్మ, కార్యదర్శిగా డాక్టర్ వెంకటరంగారెడ్డి, కోశాధికారిగా డాక్టర్ మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. అనంరతం జరిగిన వైద్య విజ్ఞాన సదస్సులో హెపటైటిస్ జబ్బుల గురించి డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడారు. హెపటైటిస్ వైరస్ కొన్నేళ్లపాటు ఏ విధమైన లక్షణాలు చూపకుండా శరీరంలో ఉండి లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఇవి తల్లికి ఉంటే బిడ్డకు, కలుషిత రక్తమార్పిడి, సిరంజిలు, అరక్షిత సెక్స్ వల్ల సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. కొత్తగా వచ్చిన సొఫాసుబవిర్, వెల్పటాసవిర్ మందులతో 99 శాతం మందిలో హెపటైటిస్- సిని నయం చేయవచ్చన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా హెపటైటిస్-బి నుంచి కాపాడవచ్చన్నారు. ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి పెద్దపేగు, చిన్నపేగులో ఉన్న కణతులను ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపి ద్వారా తొలగించడంపై వివరించారు. అనంతరం ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ నరేష్‌భట్ కూడా ప్రసంగించారు. -
ఎల్లో కల్లోలం
ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే! హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం కాలేయానికి ముప్పు ఖాయం. కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ! ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్ రాకుండా చూసుకోవడం చాలా.. చాలా.. చాలా.. అవసరం. అందరికీ కామెర్లుగా తెలిసిన ఈ హెపటైటిస్ వైరస్ ఒక ఎల్లో కల్లోలం!! హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం. మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం. గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా. ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం అవసరం. హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది? హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎప్పుడు బయట పడతాయి? హెపటైటిస్ వైరస్లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి. హెపటైటిస్లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు. చికిత్స: అన్ని రకాల హెపటైటిస్లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు. వైరస్ సంక్రమణ హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్లలో ఏ, ఈ అనే వైరస్లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి. హెపటైటిస్ – ఏ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. హెపటైటిస్ – బి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – సి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – డి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – ఈ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట. నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా? కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి. ⇒ సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి ⇒ హెపటైటిస్ వైరస్ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ⇒ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి. ⇒ మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి. ⇒ ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ⇒ ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి. ⇒ తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ⇒ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙ కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు. హెపటైటిస్ ఏ ఇది భారత్‌లో ఎక్కువ ⇒సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది ⇒దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్) ⇒ వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి n ఐజీఎమ్ హెచ్ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ⇒ దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం ⇒అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బి ⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది ⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది ⇒సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది ⇒దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది ⇒లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ సి ⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే ⇒దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ⇒దీని చికిత్సకు వైరల్ ఆర్ఎన్ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం ⇒అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది ఏ, బి, సి, డి, ఇ .. వీటిల్లో ఏది తాకినా ఒళ్లంతా అల్లకల్లోలమే! ⇒హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఇ.. లు ⇒కొన్నిసార్లే ప్రాణాంతకం అయినా ⇒దీర్ఘకాలిక జబ్బులుగా మారితే మాత్రం ⇒కాలేయానికి ముప్పు ఖాయం. ⇒కాలేయం.. మన శరీరానికి ఎనర్జీ ఫ్యాక్టరీ! ⇒ఈ ఫ్యాక్టరీలో హెపటైటిస్ పొల్యూషన్ ⇒రాకుండా చూసుకోవడం ⇒చాలా.. చాలా.. చాలా.. అవసరం. ⇒అందరికీ కామెర్లుగా తెలిసిన ⇒ఈ హెపటైటిస్ వైరస్ హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వ్యాధి. కానీ దాని గురించి తెలుసుకునేముందు అసలు కాలేయం ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాధి ఎంత కీలకమైన అవయవాన్ని దెబ్బ తీస్తుందో తెలుసుకుంటేనే ఆ వ్యాధి వల్ల మనకు జరిగే నష్టమేమిటో అర్థమవుతుంది. మొదట ఆహారంతో మొదలుపెడదాం. తిన్న తర్వాత శక్తిని పుట్టించే ప్రక్రియ జరిపేదీ... శక్తి అవసరం లేనప్పుడు దాన్ని దాచే బాధ్యత నిర్వహించేదీ కాలేయమే. పొరబాటున మన వేలు తెగిందనుకోండి... వెంటనే రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్‌ను రంగంలోకి దింపి ఆ రక్తస్రావాన్ని అరికట్టేది కాలేయం. మనం మాంసాహారం తినగానే జీర్ణక్రియలో అమైనోయాసిడ్స్ తయారౌతాయి. అవి అలాగే రక్తంలోకి వెళ్తే... వెంటనే చనిపోవడం ఖాయం. వాటిని ప్రోటీన్లుగా మార్చి మనకు ఉపయోగపడేలా, మనకు రోగనిరోధక శక్తి కల్పించేలా, మన కండరాల రిపేర్లు జరిగేలా చూసేది కాలేయం. గుండెకు సేఫ్టీ వాల్వ్ కాలేయం. హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం ద్వారా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో గుండెలోకి ఎంత రక్తం వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందో అంతే రక్తాన్ని పంపి గుండెను కాపాడేదే కాలేయం. బయటి పదార్థం ఒంట్లోకి ఏది ప్రవేశించినా దానిలోని విషాలను విరిచేసేదీ కాలేయమే. అది సిగరెట్ పొగైనా... ఆల్కహాల్ డ్రింకైనా... ఇంకేదైనా విషమైనా. ఇలా కాలేయం చేసే పనులను ఒక జాబితాగా రాయాలంటే కనీసం ఐదొందలైనా ఉంటాయి. అది ఉత్పత్తి చేసే ఎంజైములు తక్కువలో తక్కువగా చెప్పాలన్నా వెయ్యికి పైగానే ఉంటాయి. అంతటి కెమికల్ ఫ్యాక్టరీని బయట మనం ఎక్కుడైనా పెట్టాలంటే వంద ఎకరాల స్థలం కావాలి. కానీ కిలోన్నర బరువు తూగేంత పరిమాణంలో ఉండి ఈ పనులన్నీ చేస్తుంది కాలేయం. అలా అది చేసే పనులన్నింటినీ దెబ్బతీసే జబ్బు హెపటైటిస్. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదువుతున్న కేసుల్లో హెపటైటిస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వ్యాధితో చనిపోతున్న వారిలో సగానికి పైగా భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలకు చెందినవారే. హెపటైటిస్ సోకినప్పుడు దాని వల్ల కలిగే నష్టం ఏమిటన్నది చాలా మందికి సూచనప్రాయంగా కూడా తెలియదు. కానీ అదే జరిగితే కొన్నేళ్లలోనే అది కాలేయ క్యాన్సర్‌గా బయటపడి ప్రాణాలకే ముప్పు తేవచ్చు. అందుకే హెపటైటిస్పై అవగాహన పెంచుకోవడం అవసరం. హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది? హైపటైటిస్ అనేది వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఇందులో హైపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే ఐదు రకాల వైరస్‌లున్నాయి. అవి సంక్రమించినప్పుడు తొలుత కనిపించే లక్షణం కామెర్లు. దాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోకపోతే అది ముదిరి కాలేయం పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కామెర్లు సోకిన వారికి మద్యం అలవాటు ఉన్నా, తెలియక ఏవైనా ఔషధాలూ, ఆకుపసర్లు తీసుకున్నా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎప్పుడు బయట పడతాయి? హెపటైటిస్ వైరస్లు ఒంట్లోకి ప్రవేశించాక అవి తమ ప్రభావం చూపించి, వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. హెపటైటిస్–ఏ, ఈ వైరస్లు బయటపడటానికి రెండు నెలల నుంచి ఆర్నెల్ల సమయం తీసుకుంటాయి. అదే బీ, సీ వైరస్లు అయితే ఎనిమిది వారాల నుంచి ఇరవయ్యారు వారాల సమయం పడుతుంది. హెపటైటిస్ బీ, సీ వైరస్లు మిగతా వాటి కంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి అవి శరీరంలోకి ప్రవేశిస్తే చాలా కాలం పాటు ఉండి, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతాయి. నిరంతరం కాలేయ కణాలపై దాడి చేస్తూ లివర్ స్కార్స్కు దారితీస్తాయి. చివరకు కాలేయ క్యాన్సర్‌తో ప్రాణాలను కబళిస్తాయి. హెపటైటిస్లోని లక్షణాలు: ∙నీరసం ∙వికారం ∙ఆకలి లేకపోవడం ∙మూత్రం పచ్చగా రావడం ∙కళ్లు కూడా పచ్చగా కనిపించడం వంటివి కొన్ని ప్రధాన లక్షణాలు. చికిత్స: అన్ని రకాల హెపటైటిస్లలోనూ ప్రధానంగా లక్షణాలను బట్టే ఈ వ్యాధికి చికిత్స ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని వల్ల ఇతర పరిణామాలను అదుపు చేయడానికి అవసరమైన చికిత్స అందించాల్సి రావచ్చు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి చికిత్స తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. ఇప్పుడు అధునాతన వైద్య పరికరాలు, విధానాలు అందుబాటులోకి రావడంతో ఈ చికిత్స ఇప్పుడు 95 శాతం వరకు విజయవంతమవుతోంది. కాలేయ మార్పిడితో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్ డోనార్) నుంచి సేకరించి కాలేయాన్ని అవసరమైన వారికి అమర్చడం. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి నుంచి అతడి కాలేయంలోని కొంత భాగాన్ని (దాదాపు 25 శాతం) దానంగా స్వీకరించి, అమర్చవచ్చు. వైరస్ సంక్రమణ హెపటైటిస్‌ను సంక్రమింపజేసే వైరస్లలో ఏ, ఈ అనే వైరస్లు కలుషితమైన నీళ్లు, కలుషితాహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హెపటైటిస్ బి, సీ వైరస్లు మాత్రం కలుషితమైన రక్తం లేదా రక్తపు ఉత్పత్తులను శరీరంలోకి ఎక్కించడం వల్ల సంక్రమిస్తాయి. లేదా శారీరకంగా కలిసినప్పుడు ఒంట్లోని స్రావాల కలయిక వల్ల కూడా వ్యాప్తిస్తాయి. ఒక్కో హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుందో తెలియాలంటే ఈ కింద ఉన్న జాబితా చూడండి. హెపటైటిస్ – ఏ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. హెపటైటిస్ – బి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – సి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – డి రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా హెపటైటిస్ – ఈ మలపదార్థాలతో కలుషితమైన ఆహారం నోటి ద్వారా ఇతరులకు చేరడం వల్ల. అంటే హెపటైటిస్ ఏ, ఈ రకాలు ఒక విధంగానూ, బి, సి, డి... రకాలు మరో రకంగానూ వ్యాప్తి చెందుతాయన్నమాట. నివారణ / కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా? కాలేయానికి ఉన్న సామర్థ్యం, దాని పనితీరు గురించి అవగాహన లేకపోవడం వల్ల, కాలేయ వ్యాధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే చాలామంది హెపటైటిస్ వ్యాధి బారిన పడుతుంటారు. దీనితో పాటు అనారోగ్యకరమైన జీవనశైలితో కాలేయాన్ని దెబ్బతీసే వైరస్ల బారిన పడుతున్నారు. దాంతో ఆ తర్వాతికాలంలో కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా పరిస్థితిని కాలేయ క్యాన్సర్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలివి. ∙సొంతంగా హెల్త్ సప్లిమెంట్ల వంటివి తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకే వాటిని వాడాలి ∙హెపటైటిస్ వైరస్ల నంచి కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ తీసుకోవాలి ∙ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను నీటితో బాగా శుభ్రం చేసిన తర్వాతనే వాడాలి ∙మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి ∙ఊబకాయం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఊబకాయం ఏర్పడితే పోషకాహార నిపుణులు, వైద్య నిపుణుల సలహాలు తీసుకొని బరువును అదుపులో ఉంచుకోవాలి ∙తగినంత శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ∙కామెర్ల వ్యాధి సోకినట్లు గుర్తించినప్పుడు నాటు వైద్యం, ఆకుపసర్ల జోలికి అస్సలు పోకూడదు. హెపటైటిస్ల గురించి సంక్షిప్తంగా హెపటైటిస్ ఏ ఇది భారత్‌లో ఎక్కువ సాధారణంగా మన జీవిత కాలంలోని మొదటి, రెండో దశాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది దానంతట అదే తగ్గుతుంది (సెల్ఫ్ లిమిటింగ్) వైరస్ ప్రవేశించిన రెండు నుంచి నాలుగు వారాల్లో లక్షణాలు బయటపడతాయి ఐజీఎమ్ హెచ్ఏవీ పరీక్షతో నిర్ధారణ చేస్తారు.దీర్ఘకాలిక దశ ఉండదు, కాలేయాన్ని కుంచించుకుపోయేలా చేసే సిర్రోసిస్ దశ ఉండదు. కాబట్టి చాలాసందర్భాల్లో నిరపాయకరం అయితే ఒక్కోసారి తీవ్రమైన హెపటైటిస్‌కు కారణమవుతుంది లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బి ⇒ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది ⇒రక్తంతో కలుషితమైన సూదుల వల్ల, సెక్స్ ద్వారా వ్యాప్తిచెందుతుంది. ⇒చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గినా, కొన్ని సందర్భాల్లో చికిత్స అవసరమవుతుంది. ⇒ దీర్ఘకాలిక కాలేయ సమస్యలకు దారితీస్తుంది. ⇒ లివర్ సిర్రోసిస్‌కు దారితీసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ⇒ఆహారం, నీళ్ల ద్వారా వ్యాప్తిచెందదు n వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ సి ⇒వ్యాప్తిలో హెపటైటిస్ బి కంటే కాస్త తక్కువే ⇒ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ n దీని చికిత్సకు వైరల్ ఆర్ఎన్ఏ, జీనోటైప్ పరీక్షలు అవసరం. చికిత్స ఎంతకాలం కొనసాగాలో తెలిపేందుకు కూడా ఈ పరీక్ష అవసరం. ⇒ నివారణకు అవకాశం లేదు అయితే వ్యాక్సిన్ కనిపెట్ట డానికి విశేష కృషి జరుగుతోంది. ⇒ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉంది. ⇒కొద్దికాలంగా అందుబాటులో కొన్ని కొత్త మందులు. హెపటైటిస్ డి ఇది తనంతట తానే మనుగడ సాధించలేదు. సాధారణంగా హెపటైటిస్ బి వచ్చిన వారిలో ఆ తర్వాత కనిపిస్తుంది. దీర్ఘకాలిక సిర్రోసిస్ లేదా తీవ్రమైన సిర్రోసిస్‌కు కారణమవుతుంది. ఇంటర్ఫెరాన్ వంటి మందులతో చికిత్స సాధ్యమే. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. హెపటైటిస్ ఇ ⇒ఒక్కోసారి చాలా మంది సమూహాలుగా దీని బారిన పడవచ్చు లేదా విడివిడిగానూ రావచ్చు ⇒ఏ వయసువారిలోనైనా రావచ్చు కానీ యుక్తవయస్కుల్లోనే ఎక్కువ ⇒మలం వల్ల కలుషితమైన ఆహారంతోనే వ్యాప్తి ⇒వ్యాధి దీర్ఘకాలికం కాదు. కాకపోతే అప్పటికప్పుడు తీవ్రంగా వస్తుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ డి ఇది తనంతట తానే మనుగడ సాధించలేదు. సాధారణంగా హెపటైటిస్ బి వచ్చిన వారిలో ఆ తర్వాత కనిపిస్తుంది. దీర్ఘకాలిక సిర్రోసిస్ లేదా తీవ్రమైన సిర్రోసిస్‌కు కారణమవుతుంది. ఇంటర్ఫెరాన్ వంటి మందులతో చికిత్స సాధ్యమే. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. హెపటైటిస్ ఇ ⇒ఒక్కోసారి చాలా మంది సమూహాలుగా దీని బారిన పడవచ్చు లేదా విడివిడిగానూ రావచ్చు ⇒ఏ వయసువారిలోనైనా రావచ్చు కానీ యుక్తవయస్కుల్లోనే ఎక్కువ ⇒మలం వల్ల కలుషితమైన ఆహారంతోనే వ్యాప్తి ⇒వ్యాధి దీర్ఘకాలికం కాదు. కాకపోతే అప్పటికప్పుడు తీవ్రంగా వస్తుంది ⇒లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్) ⇒త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ బాలచంద్రన్ మీనన్ కాలేయ వ్యాధుల నిపుణులు – సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
ఈ చిన్నారిని ఆదుకోరూ..
గార్ల: తమ చిన్నారి కాలేయ వ్యాధితో బాధపడుతోందని, లివర్ ప్లాంటేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని, ఆర్థిక సాయం చేసి తమ చిన్నారిని అదుకోవాలని మూడున్నరేళ్ల సౌజన్య తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. మహబూబాబాద్ గార్ల మండలం రామాపురానికి చెందిన మేడేపల్లి సతీష్, మమత దంపతుల కుమార్తే సౌజన్య కాలేయ వ్యాధితో బాధపడుతోంది. అనేక ఆస్పత్రులలో చూపించి చాలా వరకు ఖర్చు పెట్టారు. అయినా వ్యాధి నయం కాలేదు. క్షౌర వృత్తితో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో సతీష్ చాలా చోట్ల అప్పులు చేశాడు. అయినా వ్యాధి నయంకాక మరింత ముదిరింది. ఈ క్రమంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చూపించగా రెండు నెలల వ్యవధితో లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలని సుమారు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నరవుతున్నారు. ఆర్థిక సాయం కోసం ఇటీవల మంత్రి కేటీఆర్ ను కలవగా హామీ ఇచ్చారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని చిన్నారి తల్లిదండ్రలు వాపోయారు. దాతలు సాయం చేసి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని వారు వేడుకుంటున్నారు. -
మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ‘మా బిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా రూ. 25 లక్షలు ఖర్చవుతుందంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. కూతురు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాము. రాత్రింబవళ్లు ఇద్దరం కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితి. వైద్యం చేయించలేక పోతున్నాము. మా కూతురు కారుణ్య మరణానికి అనుమతించండి’ అని జగద్గిరిగుట్టకు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతులు గురువారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హర్షిత(11) కొంతకాలంగా కామెర్లతో బాధపడుతుండగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అమ్మాయికి కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని ఇందుకోసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ దంపతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునూతలకు చెందిన రాంచంద్రారెడ్డికి కూతురు హర్షితతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం నగరానికి వచ్చిన వీరి కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటుంది. స్థానికంగా ఓ స్వీట్‌షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగద్గిరిగుట్టలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షితను అనారోగ్య కారణాల వల్ల చదువు మాన్పించారు. కష్టపడి సంపాదించిన రూ. 2.5 లక్షలు సైతం కూతురు కోసమే ఖర్చు చేశానని, ఇక తన వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకనే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నట్లు రాంచంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. -
చిట్టితల్లికి ఎంత కష్టం!
జ్ఞానసాయిని కబళిస్తున్న మృత్యు రాకాసి శాపంగా మారిన కాలేయ సంబంధ జబ్బు మహానాడులో ముఖ్యమంత్రికి విన్నవించినా అందని భరోసా దాతల సాయం కోసం ఎదురుచూపు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ పిటిషన్ పుట్టినప్పటి నుంచి అనారోగ్యం ఆ చిన్నారికి శాపమైంది. ఎనిమిది నెలలుగా కాలేయ వ్యాధి రోజురోజుకూ తీవ్రమౌతూ వేధిస్తోంది. బిడ్డ పడుతున్న బాధను చూసి తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ చిన్నారికి ప్రాణభిక్షపెట్టాలని దాతలను వేడుకుంటున్నారు. చివరికి కాలేయ మార్పిడి చేసే స్తోమత లేక కూతురి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించారు. తంబళ్లపల్లెః తమ బిడ్డకు కాలేయ సంబంధ వ్యాధి సోకడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాైగె నా కాపాడుకునేందుకు కనిపించిన ప్రతి ఒక్కరికీ మొక్కుతున్నారు. అయినా వారి కష్టం తీరడం లేదు. దీంతో విసిగి వేసారి తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్డును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బత్తలాపురం రైల్వేస్టేషన్‌కు చెందిన రమణప్ప, సరస్వతిలది పేద కుటుంబం. రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రమణప్ప బెంగళూరులోని సూపర్మార్కెట్లో సేల్స్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి గత ఏడాది అక్టోబర్ 10న మదనపల్లెలోని దేశాయ్ ఆసుపత్రిలో కుమార్తె (జ్ఞానసాయి) పుట్టింది. పుట్టిన వెంటనే సురక్ష ఆసుపత్రిలో రెండు రోజులపాటు ఆ పసికూనను ఐసీయూలో ఉంచారు. అనంతరం వివిధ పరీక్షలు చేసి తిరుపతిలోని ఓం ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి డాక్టర్లు ఆ చిన్నారికి వైద్య పరీక్షలు చేసి బిలియరీ అట్రాసియా(కాలేయం జబ్బు) ఉన్నట్లు నిర్ధారించి రెండు వారాల్లోపు లివర్ ప్రైమరీ సర్జరీ చేయాలని ఇందుకు సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో వారికి దిక్కుతోచక ఇంటిముఖం పట్టారు. డబ్బు సమకూర్చుకుని నెల తరువాత బెంగళూరు ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి డాక్టర్లు గత ఏడాది డిసెంబర్ 31న సర్జరీ చేశారు. నాలుగు నెలల తరువాత ఫలితం చెబుతామని అక్కడే వైద్య చికిత్సలు అందించారు. సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. నాలుగు నెలల తరువాత తిరిగి బిడ్డను అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ విఫలమైందని చెప్పారు. ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి లివర్ పూర్తిగా మార్పుచేస్తే ఫలితం ఉంటుందన్నారు. ఇందుకు రూ.15 నుంచి 16 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పినట్లు తెలిపారు. కాలేయం మార్పిడి తర్వాత కోలుకునేందుకు ఏడాది నుంచి రెండేళ్ల కాలం వరకు పడుతుందనీ, ఆ సమయంలో నెలకు రూ.50 వేల విలువైన మందులు వాడాలని వైద్యులు చెప్పారని స్పష్టంచేశారు. నాలుగు నెలలోపు మార్పుచేయాలని లేకుంటేప్రమాదమేనని తెల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చంద్రన్న బరోసా ఏదీ..? తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించినట్లు రమణప్ప తెలిపాడు. అయితే ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోయాడు. తంబళ్లపల్లె న్యాయమూర్తికి వినతి ఆర్థిక స్థోమతలేక అప్పులు దొరక్కా ఏం చేయాలో దిక్కుతోచక కేరింతలు కొట్టే వయసులో ఆ బాలికలను చూస్తూ కుమిలిపోతున్నారు. చివరికి చేసేదిలేక కనీసం న్యాయస్థానానైనా ఆశ్రయిద్దామనే ఆశతో ఆ దంపతులు గురువారం తంబళ్లపల్లె కోర్టుకు వచ్చారు. తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ కారుణ్య మరణానికి అనుమతించాలని న్యాయమూర్తి వాసుదేవ్‌కు విన్నవించుకున్నారు. ఆయన స్పందిస్తూ ఇలాంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని, వీలైతే రాజకీయ నాయకుల సహాయం కూడా తీసుకోవాలనీ సూచించించారు. దీంతో మరింత ఆవేదన చెందుతూ చేసేదిలేక వెనుదిరిగారు. కనీసం దాతలైనా తమ బిడ్డకు ప్రాణభీక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేసే వారు 8142272114 నంబరులో సంప్రదించవచ్చు. 23టిబిపి31: తండ్రితో చిన్నారి జ్ఞానసాయి ప్రమాదమేనని తేల్చిచెప్పడంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చంద్రన్న భరోసా ఏదీ..? తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. తిరుపతిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించినట్లు రమణప్ప తెలిపాడు. అయితే ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని వాపోయాడు. తంబళ్లపల్లె న్యాయమూర్తికి వినతి ఆర్థిక స్థోమతలేక.. అప్పులు దొరక్క.. ఏం చేయాలో దిక్కుతోచక.. కేరింతలు కొట్టే వయసులో ఆ బాలికను చూస్తూ కుమిలిపోతున్నారు. చివరికి చేసేదిలేక కనీసం న్యాయస్థానాన్నైనా ఆశ్రయిద్దామనే ఆశతో ఆ దంపతులు గురువారం తంబళ్లపల్లె కోర్టుకు వచ్చారు. తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ కారుణ్య మరణానికి అనుమతించాలని న్యాయమూర్తి వాసుదేవ్‌కు విన్నవించుకున్నారు. ఆయన స్పందిస్తూ ఇలాంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలే నిర్ణయం తీసుకుంటాయని సూచించారు. దీంతో మరింత ఆవేదన చెందుతూ చేసేదిలేక వెనుదిరిగారు. కనీసం దాతలైనా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేసే వారు 8142272114 నంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. -
తెలంగాణ వీరస్వామికి కన్నీటి వీడ్కోలు
ముషీరాబాద్: కాలేయ సంబంధిత వ్యాధితో సోమవారం మరణించిన తెలంగాణ వీరస్వామి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ వాదులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పార్శిగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. అంతకుముందు రాంనగ ర్ డివిజన్ హరినగర్‌లోని వీరస్వామి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, గ్రేటర్ చైర్మన్ శ్రీధర్, టీజీవో నాయకులు ఎంబీ కృష్ణయాదవ్, ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం.నర్సయ్య, గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కల్పనా యాదవ్, సీపీఎం నాయకులు శ్రీనివాస్, శ్రీనివాసరావు, న్యూ డెమోక్రసీ నాయకులు అరుణోదయ రామారావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాంనగర్ డివిజన్ కన్వీనర్ నర్సింగ్, దోమలగూడ డివిజన్ కన్వీనర్ శ్రీనివాస్, గాంధీనగర్ డివిజన్ కన్వీనర్ డికె.శ్రీనివాస్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. -
చిన్నారికి పెద్ద కష్టం..!
డోన్ రూరల్: ఆ పసిబాలుడికి పెద్ద కష్టమొచ్చింది. ఏడు నెలలు నిండని వయసులో విధిని ఎదిరించి పోరాటం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. డోన్ మండలం యు. కొత్తపల్లె గ్రామానికి చెందిన జరీనాకు అదే గ్రామానికి చెందిన హుసేన్‌బాషాతో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయినా మూడేళ్ల తర్వాత ఆమెకు మగపిల్లాడు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వారిని విధి చిన్నచూపు చూసింది. ఏడునెలల ఇమ్రాన్‌కు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో చూపించారు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు చిన్నారికి కాలేయ వ్యాధి ఉందని చెప్పారు. దీంతో వారు జబ్బు నయం కోసం రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో, కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చిన్నారిని చూపించగా రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. ఈ ఆపరేషన్ కూడా 16 రోజులలోనే చేయాలని వైద్యులు చెప్పారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు: హుసేన్‌బాషా, జరీనాలది నిరుపేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడి జబ్బు నయం కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. అయినా జబ్బు నయం కాలేదు. అయితే ఇప్పుడు రూ. 30 లక్షలు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిగా తయారైంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించదని చెప్పడంతో వారికి దిక్కుతోచడం లేదు. మూడేళ్లతర్వాత పుట్టిన కుమారుడిని రక్షించుకోలేక ఆత ల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తన కుమారుడిని రక్షిస్తే జీవితాంతం వారికి రుణపడి ఉంటామని ఆ తల్లిదండ్రులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ఉంటే సెల్: 9959277796కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.