మన బాడీలో పవర్ హౌస్ లివర్. లివర్ పనితీరు దెబ్బ తింటే అనే అనారోగ్యాల బారిన పడతాం. కాలేయం దెబ్బతింటే వచ్చే కామెర్ల వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రం ఈ వ్యాధిని నిర్ణయిస్తారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా చికిత్స ఉంటుంది.
ప్రీహెపాటిక్: రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరిగితే, దానిని ప్రీహెపాటిక్ కామెర్లు అంటారు.
హెపాటిక్ : కాలేయం బిలిరుబిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతే దానిని హెపాటిక్ కామెర్లు అంటారు.
పోస్ట్‌థెపాటిక్: బిలిరుబిన్ పేరుకుపోవడం, శరీరం తొలగించలేకపోవడాన్ని పోస్ట్‌థెపాటిక్ కామెర్లు అంటారు.
అబ్‌స్ట్రక్టివ్:.పాంక్రియాటిక్ వాహిక మూసుకుపోయినపుడు వచ్చిన కామెర్లను అబ్‌స్ట్రక్టివ్ కామెర్లుగా పిలుస్తారు.
నవజాత శిశువులు కూడా జాండిస్ బారిన పడతారు. దీనికి ‘ఫోటోథెరపీ’ ట్రీట్‌మెంట్ ద్వారా నయం చేస్తారు
లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు
లివర్ ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి.
టీ: బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల లివర్‌కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది లివర్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. రోజూ ఒక కప్పు కాఫీ తీసుకున్నా మంచిదే.
టోఫు : సోయాతో తయాయ్యే టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయా బీన్స్‌తో సొయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు.
పండ్లు : ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, ద్రాక్ష వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తీసుకోవచ్చు.
ఓట్స్ , నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా బీన్స్, గింజలు వంటివి కూడా తీసుకో వచ్చు. విటమిన్-ఇ సమృద్ధిగా నట్స్‌తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది.
కూరగాయలు : బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర కూరలతో లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుండి కూడా బయట పడొచ్చు. పాలకూర వంటి వాటిలో గ్లూటాతియోన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నోట్: లక్షణాలు చూసి బయపడిపోకుండా, వైద్యులను సంప్రదించి, రక్త, మూత్రం, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మద్య పానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment