నిషికాంత్ కామత్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన.
ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు నిషికాంత్. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్ గానూ కనిపించారాయన.
Comments
Please login to add a commentAdd a comment