admitted to hospital
-
హాస్పిటల్లో చేరిన కమల్‌హాసన్.. అభిమానుల ఆందోళన
Kamal Haasan Admitted In Hospital: విలక్షణ నటుడు కమల్‌హాసన్ మరోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చైన్నైలోని ప్రముఖ శ్రీరామచంద్ర హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్5 ఫినాలే ఆదివారం పూర్తయిన సంగతి తెలిసిందే. -
భర్త అరెస్ట్.. హాస్పిటల్లో నటి పూనమ్ పాండే
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. -
ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా
సాక్షి, ముంబై: వరుస సంఘటనలు బాలీవుడ్ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ప్రముఖ నటి మందిరా బేడీ భర్త హఠాన్మరణం బాలీవుడ్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, మరో ప్రముఖ యాక్టర్ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం మరింత ఆందోళనకు గురి చేసింది. జూన్ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత, దిలీప్ కుమార్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దిలీప్ కుమార్ (98)కు మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. దిలీప్ కుమార్ ఆరోగ్యంపైఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా బుధవారం ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియాతో బాధపడుతున్న షా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు షా బాగానే స్పందిస్తున్నారని షా మేనేజర్ ధృవీకరించారు. అటు నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.త్వరలో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామని నసీరుద్దీన్ షా భార్య, నటి రత్నా పథక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆసుప్రతిలో చేర్పించాల్సి వచ్చిందన్నారు. కాగా మందిరా బేడీభర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత Gold Price: గుడ్‌న్యూస్,ఈ ఒక్క నెలలోనే ఎంత తగ్గిందో తెలుసా? -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కరోనా, ఆసుపత్రికి తరలింపు
సాక్షి,ముంబై: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రకంపనలు పుట్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు పుంజు కుంటున్నాయి. కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అనేకమంది వైద్యులు, ఇతర సెలబ్రిటీలు కోవిడ్-19 వైరస్ సోకుతోంది. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. అయితే తేలికపాటి లక్షణాలతో నాగ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ భగవత్ ఆరోగ్యంపై సమాచారాన్ని పోస్ట్ చేసింది. మార్చి 7న ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. కాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల నమోదు భారీగా ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం తాజాగా1,45,384 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మరో 794 మంది మరణించారు. RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat today tested Corona positive. He has normal symptoms and admitted to Kigsway hospital Nagpur. — RSS (@RSSorg) April 9, 2021 -
ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ (ఆర్ అండ్ ఆర్) లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. President Ram Nath Kovind visited Army Hospital (R&R) following chest discomfort this morning. He is undergoing routine check-up and is under observation. His condition is stable: Army Hospital (R&R) (file photo) pic.twitter.com/A5hfrA3HXW — ANI (@ANI) March 26, 2021 -
ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు నిషికాంత్. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్ గానూ కనిపించారాయన. -
ముంబై ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ స్టార్, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం(ఆదివారం) ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మృతిచెందిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇర్ఫాన్ ముంబైలో ఉండటం వల్ల జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేక యాడు. ఆ సమయంలో ఇర్ఫాన్ అనారోగ్యానికి గురవడం కూడా తల్లి అంత్యక్రియలకు వెళ్లకపోవడం ఓకారణం. వీడియో కాల్ ద్వారా జైపూర్‌లోని తల్లి అంతక్రియలు ఆయన పాల్గొన్నారు. తల్లి మరణం కారణంగా ఆందోళన చెందుతున్న ఇర్ఫాన్ మరింత అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’ ) కాగా గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చిక్కిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. అయితే తిరిగి అనారోగ్యానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్లకు ఇర్ఫాన్ దూరంగా ఉన్నారు. ఇక మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా పడింది. (సచిన్ ట్వీట్‌కు క్రికెట్ భాషలో చిరు రిప్లై ) ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముంబైలో నివసిస్తున్న వీరంతా ప్రస్తుతం అతనితో ఆసుపత్రిలో ఉన్నారు. ఇర్ఫాన్ బాలీవుడ్ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై వంటి హాలీవుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. 2017 లో విడుదలైన ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ చిత్రంతో నిర్మాతగా మారారు. (నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను: నటుడు) -
ఎయిమ్స్‌లో బిహార్ సీఎం నితీష్..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆయన ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నితీష్ కుమార్ మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఎయిమ్స్ ప్రైవేట్ వార్డులో చేరారని తెలిపాయి. జ్వరం, కన్ను, మోకాలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలపడంతో నితీష్‌ను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. నితీష్ ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులు వెల్లడిస్తారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఆమెకు ఇన్ఫెక్షన్ చేరడంతో సోనియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిలోకి ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి.