ముంబై ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ నటుడు | Hero Irrfan Khan Admitted to Mumbai Hospital | Sakshi
Sakshi News home page

ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్‌

Published Tue, Apr 28 2020 7:16 PM | Last Updated on Tue, Apr 28 2020 7:27 PM

Hero Irrfan Khan Admitted to Mumbai Hospital - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం(ఆదివారం) ఇర్ఫాన్‌ తల్లి సయీదా బేగం మృతిచెందిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఇర్ఫాన్‌ ముంబైలో ఉండటం వల్ల జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేక యాడు. ఆ సమయంలో ఇర్ఫాన్‌ అనారోగ్యానికి గురవడం కూడా తల్లి అంత్యక్రియలకు వెళ్లకపోవడం ఓకారణం. వీడియో కాల్‌ ద్వారా జైపూర్‌లోని తల్లి అంతక్రియలు ఆయన పాల్గొన్నారు. తల్లి మరణం కారణంగా ఆందోళన చెందుతున్న ఇర్ఫాన్‌‌  మరింత అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’ )

కాగా గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చిక్కిత్స కూడా తీసుకున్నాడు. ఇందుకు ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే క్యాన్సర్‌ నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. అయితే తిరిగి అనారోగ్యానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్లకు ఇర్ఫాన్‌ దూరంగా ఉన్నారు. ఇక మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. (సచిన్‌ ట్వీట్‌కు క్రికెట్‌ భాషలో చిరు రిప్లై )

ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముంబైలో నివసిస్తున్న వీరంతా ప్రస్తుతం అతనితో ఆసుపత్రిలో ఉన్నారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు.  2017 లో విడుదలైన ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ చిత్రం‌తో నిర్మాతగా మారారు. (నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను: నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement