
సోనియాగాంధీ (ఫైల్)
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఆమెకు ఇన్ఫెక్షన్ చేరడంతో సోనియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సర్ గంగారాం ఆస్పత్రిలోకి ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి.