lung infection
-
పోప్ స్పృహలోనే ఉన్నారు
రోమ్: ‘పోప్ ఫ్రాన్సిస్(88) స్పృహలోనే ఉన్నారు. అయితే, సంక్లిష్టమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కార ణంగా ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది’అని వాటికన్ ఆదివారం తెలిపింది. శనివారం రాత్రి శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు, రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయాయి. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా ప్రారంభించిన ఆక్సిజన్ సరఫరాను ఆదివారం కూడా కొనసా గించారు. రక్తం ఎక్కించినట్లు వాటి కన్ వర్గాలు వివరించాయి. ‘రాత్రి ప్రశాంతంగా గడి చింది. ఆయన విశ్రాంతి తీసుకున్నారు’అని పేర్కొ న్నాయి. మరికొన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన ట్లు వెల్లడించింది. పోప్ బెడ్‌పై నుంచి లేచారా, ఏమైనా ఆహారం తీసుకున్నారా అనే విషయాలను మాత్రం వాటికన్ ప్రస్తావించలేదు. బ్రాంకైటిస్ తీవ్ర రూపం దాల్చడంతో పోప్ ఈ నెల 14వ తేదీన గెమెల్లి ఆస్పత్రిలో చేరడం తెలిసిందే.వాటికన్లో ప్రత్యేక ప్రార్థనలుఆదివారం ఉదయం సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ హోలీ ఇయర్ ప్రారంభ వేడుకలను ప్రారంభించాల్సి ఉంది. ఆయన ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆర్చ్ బిషప్ రినో ఫిసిచెల్లా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోప్ ఫ్రాన్సిస్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు. ‘ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నా పోప్ ఫ్రాన్సిస్ మనకు సన్నిహితంగా మనమధ్యే ఉన్నట్లుగా ఉంది’అని ఫిసిచెల్లా అన్నారు.ఫ్రాన్సిస్ రాజీనామా చేయబోరుతీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో పోప్ ఫ్రాన్సిస్ పదవికి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వదంతులను వాటికన్ అధికార వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పోప్ తన విధులను నిర్వహించలేని సమయంలో ప్రత్యామ్నాయం ఏమిటన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఇలాంటి సందర్భం తలెత్తినప్పుడు ఏం చేయాలన్న దానిపై పోప్ స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నాయి. వైద్యపరమైన అశక్తత ఏర్పడితే రాజీనామా లేఖ రాసి ఉంచినట్లు గతంలోనే పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ ఉన్నతాధికారులు కొందరు రహస్యంగా కలిసినట్లు వస్తున్న వార్తలను సైతం తోసిపుచ్చాయి. ఫ్రాన్సిస్ ఆరోగ్యం, ఆయన కోలుకోవడం, తిరిగి వాటికన్ రావడంపైనే మాట్లాడుకోవాలే తప్ప, ఇటువంటి అవసరం లేని అంశాలంటూ స్పష్టం చేశాయి. -
కరోనా రోగుల శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు
లండన్ : కరోనా వైరస్ మృతుల పోస్టుమార్టమ్ నివేదికల ద్వారా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారిలో ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. వారు నిర్వహించిన పది పోస్టుమార్టాల్లో మృతులందరికీ ఊపిరితిత్తుల్లో గాయాలున్నాయని, ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని తెలిపారు. దాదాపు తొమ్మిది మందిలో ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులో రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. ( కరోనా భారత్: 30 లక్షలు దాటిన కేసులు ) ఈ మేరకు ఓ నివేదికను ఇంపీరియల్ కాలేజ్ వెబ్సైట్లో ప్రచురించారు. తాము కనుగొన్న ఈ వివరాల ద్వారా కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్ తిన్నర్స్‌ను ఉపయోగించటం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని చెప్పారు. ఇలాంటి పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి, సరైన చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు. -
కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన విస్త్రృతిని పెంచుకుంటూ పోతోంది. తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు అత్యవసర పరిస్థితి విధించగా.. పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే కొంత మంది ప్రజలు మాత్రం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ మహమ్మారికి ఎదురువెళ్తున్నారు. ప్రాణాలు కోల్పోయే దుస్థితి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రతను ప్రజల కళ్లకు కట్టేలా.. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్పత్రి సర్జన్ డాక్టర్ కేత్ మార్ట్మన్ ఓ వీడియో షేర్ చేశారు. కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తి ఊపిరి తిత్తులు ఎంతగా నాశనం అయ్యాయో తెలిపే 3డీ వీడియో ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. (‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’ ) ఊపిరి తిత్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి.. ‘‘ఇది 70 లేదా 80 ఏళ్ల వృద్ధుడిదో.. డయాబెటిక్ పేషెంట్‌తో కాదు. కొన్నాళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న 59 ఏళ్ల వ్యక్తి రిపోర్టు. తనకు కేవలం బీపీ మాత్రమే ఉంది. అయితే కరోనా సోకి అతడి ఊపిరితిత్తులు ఇలా మారిపోయాయి. ఇందులో పసుపు రంగులో ఉన్న ప్రాంతం ఇన్ఫెక్షన్ సోకినది. వైరస్ అంతకంతకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. దీంతో ఊపిరి తిత్తులు డ్యామేజ్ అయ్యాయి. శ్వాస వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవి మళ్లీ పూర్వ స్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ప్రస్తుతం అతడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వృద్ధులపై మాత్రమే కాదు యువతపై కూడా ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపించగలదు’’ అని వీడియోలో పేర్కొన్నారు.(కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) -
నాగం జనార్ధన్‌రెడ్డికి పుత్ర వియోగం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి కుమారుడు నాగం దినకర్‌రెడ్డి (46) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన వారం రోజుల కిందటే చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేసేందుకు వైద్యులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగానే ఆస్పత్రిలో గుండెపోటుతో చనిపోయారు. జనార్దన్‌రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకైన దినకర్‌రెడ్డి వైద్యవృత్తిలో కొనసాగుతూనే సివిల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కుమారుడి మృతితో నాగం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు అపోలో ఆస్పత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు. దినకర్ 46 ఏళ్ల వయస్సులోనే చనిపోవడం నాగం కుటంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరఫున నాగం కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువరు నాయకులు నాగంను పరామర్శించారు. -
ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఆమెకు ఇన్ఫెక్షన్ చేరడంతో సోనియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిలోకి ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. -
ఇదో! డబ్బు గబ్బు
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుధాకర్ తన భార్యకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. పరిస్థితి ప్రమాధకరంగా ఉండడంతో రూ. 5 వేలు చెల్లించి అడ్మిట్ చేశాడు. మూడు రోజుల తర్వాత బిల్లు రూ. 50 వేలు అయింది అని చెప్పడంతో డ్రైవర్‌గా పనిచేసే తన వద్ద అంత డబ్బులేదు.. ఎస్టిమేషన్ వేసి ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బును సమకూర్చుకుంటానని డాక్టర్‌కు చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన వైద్యుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే తమ ఆసుపత్రి ఈ దుస్థితి ఎదుర్కొంటోందని అదే అడ్మిట్ చేసే సమయంలో చెబితే...ఏ గాంధీకో లేదా ఉస్మానియాకో పంపేవాణ్ని కదా అంటూ రోగి సహాయకులపై విరుచుకుపడ్డాడు. డబ్బులు లేనివాడివి నిమ్స్‌కు ఎందుకు వచ్చావ్.? అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం సుధాకర్ ఒక్కరికే కాదు ఇలా ప్రతి రోజు అన్ని డిపార్ట్మెంట్లలో ఎందరో రోగులకు ఎదురౌతోన్న పరిస్థితి ఇది. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులను చేర్చుకోవడానికి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే రోగులకు మాత్రం వెంటనే బెడ్లు మంజూరు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. అదే ప్రభుత్వ పథకాలు ఉన్న రోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పగా చెప్పుకునే నిమ్స్‌లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. ఇక ఓపీల విషయానికి వస్తే ఉదయం ఓపీల్లో వైద్యులు 8 గంటలకు రావాల్సి ఉండగా చాలా మంది వైద్యులు 11, 12 గంటలకు కూడా రావడం లేదు. ఉదయం ఓపీల్లో పేద రోగులకు కేవలం రూ. 50కే చూడాల్సి రావడమే కారణం. అదే సాయంత్రం ఓపీల్లో మాత్రం రూ. 300లు వసూలు చేసి, అందులో 150 నిమ్స్‌కు, మరో 150 వైద్యుని ఖాతాలో జమ చేస్తుంటారు. దాంతో అందరూ వైద్యులు సాయంత్రం ఓపీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దాంతో పేద రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు బయట మెడికల్ షాపులతో సంబంధాలు పెట్టుకొని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని స్వయంగా నిమ్స్ ఉద్యోగులే అంటున్నారు. తాను సూచించిన మెడికల్ షాపులోనే ఈ మందులు దొరుకుతాయి. అక్కడే తీసుకోవాలి అని సూచిస్తున్నట్లు తెలిసింది. అవినీతిని రూపుమాపి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని నిమ్స్ ఉన్నతాధికారులు పేర్కొంటుంటారు. వారు తమ ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రోగులు, రోగుల సహాయకులు కోరుతున్నారు. -
విషమంగానే నెల్సన్ మండేలా ఆరోగ్యం!
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అధ్యక్ష భవన ప్రతినిది మాక్ మహారాజ్ మీడియాకు వెల్లడించారు. అయితే మండేలా ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. ఆగస్టు 11 తేదిన వెల్లడించిన నివేదికకు ప్రస్తుత పరిస్థితిలో మార్పు ఏమి లేదన్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో జూన్ 8 తేదిన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మండేలా గత 77 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. మా నాన్న ప్రస్తుతం కూర్చోగలిగే స్థితిలో ఉన్నాడని మండేలా కూతరు జిండ్జి అన్నారు.