
Poonam Pandeys Husband Sam Bombay Arrested: బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై భర్త సామ్ బాంబే అరెస్ట్ అయ్యాడు. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం..సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బాంబే..పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
పూనమ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్1న పూనమ్-శామ్ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది.అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది.
తాజాగా మరోసారి సామ్ బాంబే చేసిన దాడిలో పూనమ్ తీవ్ర గాయాలపాలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. 'ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. దాదాపు సగం హత్య చేసినంత దారుణంగా హింసించాడు. దీని వల్ల ఎన్ని రోజులు నేను హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుందో నాకే తెలియదు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment