Nishikant Kamat
-
బాలీవుడ్ డైరెక్టర్ నిశికాంత్ కామత్ కన్నుమూత
ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిశికాంత్ కామత్(50) కన్నుమూశారు. కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నిశికాంత్ మృతిని ఏఐజీ హాస్పిటల్స్ ధృవీకరించాయి. జ్వరం, ఆయాసంతో జులై 31న నిశికాంత్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన గత రెండేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, దీంతో దానికి అనుగుణంగా వైద్యం మొదలుపెట్టామని పేర్కొంది. (నిషికాంత్‌పై ట్వీట్: రేణు సహానీ వివరణ) ఆ తర్వాత తమ వైద్యంతో కామత్ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించిందని, కానీ.. ఆ తరవాత మళ్లీ ఆయన పరిస్థితి విషమించిందని ఏఐజీ హాస్పిటల్స్ పేర్కొంది. ఆయన్ని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని.. అయినప్పటికీ రోజురోజుకి ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని వెల్లడించింది. నిన్నటి నుంచి ఆయన శ్వాసకోశ పనిచేయడం మానేసిందని, అలాగే రక్తపోటు కూడా బాగా తగ్గిపోయిందని తెలిపింది. ఆయన్ని కాపాడటానికి తాము అన్నివిధాలుగా ప్రయత్నించామని, అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం నిశికాంత్ కన్నుమూసినట్లు ఏఐజీ హాస్పిటల్ ప్రకటించింది. (ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు) కాగా నిశికాంత్ మరణంపై నటుడు రితీష్ దేశ్‌ముఖ్ స్పందించారు. ‘నేను నిన్ను మిస్ అవుతాను మై ఫ్రెండ్. నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు. ఇక నిషికాంత్ కామత్ 2004 లో వచ్చిన ‘హవా అనీ డే’ అనే చిత్రంతో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం డైరెక్షన్‌పై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా అవతారమెత్తారు. అతను క్రమంగా దర్శకత్వం వైపు వెళ్ళాడు. హిందీలో దృశ్యం, మదారి, ముంబై మేరీ జాన్ లాంటి సినిమాలతో నిశికాంత్ మంచి పేరు సంపాదించాడు. -
నిషికాంత్‌పై ట్వీట్: రేణు సహానీ వివరణ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారంటూ ట్వీట్ చేసిన సినీ నటి రేణు సహాని కొద్ది సేపటికే సారీ అంటూ మరో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమంగా మారడంతో మరణించారంటూ రేణు సహానీ ట్వీటర్లో పేర్కొన్నారు. అయితే కాసేపటికే నిషికాంత్ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె మరో ట్వీట్ చేశారు. కాగా 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్‌గా నటించారు. So sorry for the tweet about Nishikant Kamat. Just heard that he is still among us & I hope he is blessed with a long life. Stay strong Nishi. Praying 🙏🏽🙏🏽🙏🏽 — Renuka Shahane (@renukash) August 17, 2020 -
ఆస్పత్రిలో దృశ్యం దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు నిషికాంత్. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్ గానూ కనిపించారాయన. -
ఆస్పత్రిలో 'దృశ్యం' దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: సక్సెస్ఫుల్ చిత్రం 'దృశ్యం' దర్శకుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో పోరాడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా నిశికాంత్ 'డోంబివాలీ ఫాస్ట్' అనే మరాఠీ చిత్రంతో 2005లో వెండితెరపై దర్శకుడిగా ప్రవేశించారు. ఈ చిత్రానికి ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. (ఇలా చేయడంతో వారంలో కోలుకున్నా: విశాల్) దీనికన్నా ముందు 'హవా ఆనే దే' అనే హిందీ సినిమాలోనూ నటించారు. 'సాచ్య ఆట ఘరాట్' అనే మరాఠీ సినిమాలోను నటనతో ఆకట్టుకున్నారు. "ముంబై మేరీ జాన్" అనే చిత్రంతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో 'ఫోర్స్', 'లై భారీ' సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే దక్షిణాదిన ఘన విజయాన్ని నమోదు చేసుకున్న "దృశ్యం" సినిమాను అజయ్ దేవ్‌గణ్, టబుతో కలిసి హిందీలో తెరకెక్కించారు. ఆయన పలు హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో పని చేశారు. "రాకీ హ్యాండ్ సమ్" చిత్రంలో విలన్‌గానూ కనిపించారు. (ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!) -
'దృశ్యం' చూడండి
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రంపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. 'దృశ్యం' తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని ఆయన సోమవారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. 'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు. ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు.