సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారంటూ ట్వీట్ చేసిన సినీ నటి రేణు సహాని కొద్ది సేపటికే సారీ అంటూ మరో ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమంగా మారడంతో మరణించారంటూ రేణు సహానీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. అయితే కాసేపటికే నిషికాంత్ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె మరో ట్వీట్ చేశారు.
కాగా 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టారాయన. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు. ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారాయన. అంతేకాదు.. ‘హవా ఆనే దే’ అనే హిందీ చిత్రంలో, ‘సాచ్య ఆట ఘరాట్’ అనే మరాఠీ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్‌గా నటించారు.
So sorry for the tweet about Nishikant Kamat. Just heard that he is still among us & I hope he is blessed with a long life. Stay strong Nishi. Praying 🙏🏽🙏🏽🙏🏽
— Renuka Shahane (@renukash) August 17, 2020
Comments
Please login to add a commentAdd a comment