'దృశ్యం' చూడండి | 'Drishyam' must watch: Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'దృశ్యం' చూడండి

Published Tue, Aug 4 2015 11:54 AM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

'దృశ్యం' చూడండి - Sakshi

'దృశ్యం' చూడండి

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రంపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. 'దృశ్యం' తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు.  ఆ  చిత్రాన్ని ఆయన సోమవారం న్యూఢిల్లీలో  ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. 'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు. ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే.

నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement