మరో అమ్మ పాత్ర?
‘మనం’, ‘గోపాల గోపాల’ చిత్రాల్లో గృహిణి పాత్రల్లో మెప్పించిన శ్రీయ తాజాగా మరో గృహిణి పాత్రను అంగీకరించారని సమాచారం. అయితే, ఈసారి హిందీలో రీమేక్ కానున్న ‘దృశ్యం’లో. మలయాళ హిట్ ‘దృశ్యం’ తెలుగు, కన్నడ భాషల్లో ఇప్పటికే పునర్నిర్మితమైంది. తమిళంలో కమలహాసన్, గౌతమి జంటగా రూపొందుతోంది. ఇప్పుడు ఇదే కథ హిందీలో అజయ్ దేవగణ్ కథానాయకునిగా రీమేకవుతోంది. ఇందులోనే శ్రీయను అడిగారట.