యూపీ సీఎంకు బాలీవుడ్ హీరో థ్యాంక్స్
ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ధన్యవాదాలు తెలిపారు. తన తాజా చిత్రం 'దృశ్యం'కు యూపీలో వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
'యూపీ ప్రభుత్వానికి, సీఎం అఖిలేశ్ కు థ్యాంక్స్. అందరూ మా సినిమా చూసేందుకు మీ నిర్ణయం ఎంతోగానో దోహదపడుతోంది' అని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు. 'బజరంగీ భాయిజాన్' తో పాటు పలు చిత్రాలకు యూపీ ప్రభుత్వం వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. తేవార్, హమారీ ఆధురీ కహానీ, మసాన్, మిస్ తనక్ పూర్ హాజిర్ హో' సినిమాలకు వినోద పన్ను రద్దు చేసింది.