'దృశ్యం అరుదైన సినిమా'
ముంబై: 'దృశ్యం' సినిమాకు వస్తున్న స్పందన పట్ల హీరో అజయ్ దేవగణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అరుదైన చిత్రమని పేర్కొన్నాడు. 'దృశ్యం సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగా ఉన్నా. మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ అరుదైన సినిమాను నటుడిగా గౌరవిస్తా' అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు.
అన్ని భాషల్లోనూ విజయవంతం అయిన 'దృశ్యం' హిందీలోనూ విజయవంతంగా నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రూ. 30.33 కోట్లు వారాంతపు వసూళ్లు సాధించింది. శ్రియా శరణ్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ సాలగోంకర్ దర్శకత్వం వహించారు. వియకొమ్ 18, కుమార్ మాగ్నత్ నిర్మించారు.