
దృశ్యం రీమేక్‌లో కమలహాసన్?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో తెరకెక్కించడానికి పోటీ ఉంటుంది. ప్రస్తుతం దృశ్యం చిత్రంపై అలాంటి పోటీనే నెలకొంది. మలయాళంలో మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం విశేష ప్రజాదరణ చూరగొం టోంది. ఇప్పటికే తెలుగు రీమేక్ హక్కులను నటి శ్రీప్రియ సొంతం చేసుకున్నారు. తమిళం రీమేక్‌లో నటించడానికి విక్రమ్, శరత్‌కుమార్ ఆసక్తి చూపినప్పటికీ తాజాగా కమలహాసన్ నటించే అవకాశం ఉందని సమాచారం.
దృశ్యం తమి ళం, హిందీ రీమేక్ హక్కులను బాలాజీ సురేష్ పొందారు. ఈయన కమల్‌కు చిత్రాన్ని చూపించగా, ఆయన బాగుందని కితాబిచ్చారట. దీనిపై నిర్మాత బాలాజీ సురేష్ మాట్లాడుతూ కమలహాసన్‌తో నిర్మించే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందీలో ఇఫ్రాన్‌ఖాన్, నానా పటేకర్, అజయ్ దేవగణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.