సినిమా బంపర్...మా నాన్న సూపర్! | Shruti Haasan Will Host Special Screening of Papanasam | Sakshi
Sakshi News home page

సినిమా బంపర్...మా నాన్న సూపర్!

Published Fri, Jul 17 2015 11:08 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

సినిమా బంపర్...మా నాన్న సూపర్! - Sakshi

సినిమా బంపర్...మా నాన్న సూపర్!

 ‘‘ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఒకవేళ నా సినిమా విడుదలైన రోజున నాన్న నటించిన సినిమా విడుదలైతే, ముందు నా సినిమా చూస్తా.. ఆ తర్వాత నాన్న సినిమా చూస్తా’’ అని ఆ మధ్య ఓ సందర్భంలో శ్రుతీహాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కమల్ కూడా అలానే అంటారు. ఈ తండ్రీ కూతుళ్లు అంత ప్రొఫెషనల్‌గా ఉంటారు. కానీ, ఒకరి సినిమాను ఇంకొకరు చూసి, బాగుంటే అభినందించుకుంటారు. ఇప్పుడు శ్రుతి అదే చేశారు. మలయాళ ‘దృశ్యమ్’ తమిళ రీమేక్ ‘పాపనాశమ్’లో కమలహాసన్, గౌతమి భార్యాభర్తలుగా నటించారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో విజయ విహారం చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రుతి చూశారు. ‘‘అద్భుతమైన సినిమా. మొత్తం టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మా నాన్నని చూస్తే గర్వంగా ఉంది’’ అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతే కాదు.. ముంబయ్‌లో తన స్నేహితులకి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేసి, ఈ చిత్రాన్ని చూపించాలనుకుంటున్నారామె. ఎంతైనా నాన్నంటే అమ్మడికి ఎంత ప్రేమో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement