రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్! | Rajinikanth rejected 'Drishyam' remake due to two scenes | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!

Published Mon, Jul 6 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!

రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!

మలయాళ సినిమా ‘దృశ్యమ్’ తెలుసుగా! ఆ సూపర్‌హిట్ సినిమా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్‌తో, కన్నడంలో ‘దృశ్య’ పేరుతో హీరో వి. రవిచంద్రన్‌తో రీమేకై హిట్టయిన సంగతీ తెలిసిందే. తాజాగా తమిళంలో కమలహాసన్‌తో ‘పాపనాశమ్’గా రిలీజై, హిట్ టాక్‌తో నడుస్తోంది. తాజా విషయం ఏమిటంటే, అసలీ తమిళ రీమేక్‌ను మొదట రజనీకాంత్‌తో చేద్దామనుకున్నారట! మలయాళ ఒరిజనల్‌కూ, ఇప్పుడీ తమిళ రీమేక్‌కూ - రెంటికీ దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ నేరుగా రజనీని కలిశారట! స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, సినిమాలోని రెండు సీన్స్ పట్ల రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
 
  ‘‘సినిమా చివరలో పోలీసులు హీరోను చితగ్గొట్టే సీన్, అలాగే క్లైమాక్స్ సీన్ - ఈ రెండిటి గురించి రజనీ అనుమానపడ్డారు. ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చేమోనని అన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఆ మాటతో ఏకీభవించారు’’ అని కోడంబాకమ్ వర్గాలు ఇప్పుడు బయటపెట్టాయి. మొత్తానికి, అలా రజనీకాంత్ వద్దన్న సినిమా కమలహాసన్‌ను వరించింది. ఇప్పుడీ తమిళ రీమేక్‌కు వస్తున్న స్పందన, పత్రికల్లో వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే, కమల్‌కు చాలాకాలం తర్వాత మంచి హిట్ వచ్చినట్లుంది. అంటే, సినిమా వదిలేసి రజనీకాంత్ నష్టపోయారనీ, కమల్ లాభపడ్డారనీ అనుకోవచ్చా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement