మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు | venkatesh next with malayali star director jeethu joseph | Sakshi
Sakshi News home page

మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు

Published Tue, Dec 15 2015 9:03 AM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు - Sakshi

మలయాళ దర్శకుడికి ఓకే చెప్పాడు

ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వెంకటేష్ మళ్లీ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలోరిజెక్ట్ చేసిన మారుతి దర్శకత్వంలో బాబు బంగారం పేరుతో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు వెంకీ.

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకటేష్. గతంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమా రీమేక్ లో హీరోగా నటించిన వెంకీ, ఈ సారి నేరుగా జీతూ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ వర్షన్ లో హీరోను ఫైనల్ చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement