మరో రీమేక్‌లో... | After Drishyam, Kamal Haasan to remake Mohanlal’s Peruchazhi? | Sakshi
Sakshi News home page

మరో రీమేక్‌లో...

Published Tue, Jun 3 2014 10:28 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

మరో రీమేక్‌లో... - Sakshi

మరో రీమేక్‌లో...

కమల్‌హాసన్ చేసిన సినిమాను రీమేక్ చేయడం సాహసమే. అందుకే... ఆ సాహసానికి అంత తేలిగ్గా ఎవరూ పూనుకోరు. కానీ... కమల్ మాత్రం ఈ మధ్య రీమేక్‌లపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ను ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’గా రీమేక్ చేశారాయన. తర్వాత నసీరుద్దీన్‌షా ‘వెడ్నెస్ డే’ చిత్రాన్ని ‘ఈనాడు’గా రీమేక్ చేశారు. ఇప్పుడేమో... మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తమిళంలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లక ముందే...

మరో రీమేక్‌కి కూడా ‘సై’ అనేశారు. ఇంతకీ కమల్ చేయనున్న ఆ రీమేక్ ఏంటా అనుకుంటున్నారా! ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా పేరు ‘పెరుచ్చాళి’. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ ఇటీవలే కమల్ విన్నారట. ఆయనకు తెగ నచ్చేయడంతో ఆ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి కమల్ ఉత్సాహం చూపుతున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం సదరు చిత్ర నిర్మాతలతో కమల్ సంప్రదింపులు జరుపుతున్నారట. అరుణ్ వైద్యనాథన్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి తమిళంలో ఈ చిత్రాన్ని ఎవరు డెరైక్ట్ చేస్తారో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement