రాంబాబు ఫ్యామిలీ స్టోరీ | Rambabu Family story | Sakshi
Sakshi News home page

రాంబాబు ఫ్యామిలీ స్టోరీ

Published Wed, Jul 2 2014 1:22 AM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

రాంబాబు ఫ్యామిలీ స్టోరీ - Sakshi

రాంబాబు ఫ్యామిలీ స్టోరీ

రాంబాబు ఓ కేబుల్ ఆపరేటర్. అతనిది చిన్న కుటుంబం. చింతలు లేని కుటుంబం. మనసెరిగిన భార్య. రత్నాల్లాంటి ఇద్దరమ్మాయిలు. ఓ సంఘటన ఈ కుటుంబాన్ని కల్లోలానికి గురి చేస్తుంది. అదేంటో తెలియాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే. వెంకటేశ్, మీనా ఇందులో హీరో హీరోయిన్లు. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం లాంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్‌లో రూపొందాయి. సీనియర్ కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకురాలు.
 
 డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ -‘‘ఇప్పటి వరకూ ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, థ్రిల్లర్ సినిమాలు చూశాం. ఈ రెంటినీ మిళితం చేసి తీసిన సినిమా ఇది. ఇందులో కుటుంబ భావోద్వేగాలతో పాటు థ్రిల్ కూడా ఉంటుంది’’ అని చెప్పారు. శ్రీప్రియ మాట్లాడుతూ -‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’కు ఇది రీమేక్. ఇందులో ప్రతి పాత్రనూ అందరూ ఐడెంటిఫై చేసుకుంటారు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement