
నెటిజన్లను ఆకర్షిస్తున్న 'దృశ్యం' పజిల్ గేమ్
మలయాళ చిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం దృశ్యం నిర్మాతలు సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో జిగ్సా పజిల్ గేమ్ ను ఆరంభించారు. దృశ్యం పజిల్ గేమ్ ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ గేమ్ ఆడిన నెటిజన్లు ప్రతి రోజుల బహుమతులను కూడా గెల్చుకుంటున్నారు. ఈ పజిల్ గేమ్ లో దృశ్యం చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు పొందుపరిచారు.
వెంకటేశ్, మీనాలు కలిసి నటిస్తున్న దృశ్యం చిత్రానికి అలనాటి నటి శ్రీప్రియ రాజ్ కుమార్ దర్శకత్వం వహించగా, సురేశ్ ప్రోడక్షన్ నిర్మిస్తోంది. ఈ పజిల్ లో పాల్గొనేందుకు http:// bit.ly/DrishyamPuzzle క్లిక్ చేయవచ్చు.