దృశ్యం కోసం కేరళ వెళ్లిన వెంకీ | Drishyam Telugu version being shot in Kerala | Sakshi
Sakshi News home page

దృశ్యం కోసం కేరళ వెళ్లిన వెంకీ

Published Tue, Mar 18 2014 4:42 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

దృశ్యం కోసం కేరళ వెళ్లిన వెంకీ - Sakshi

దృశ్యం కోసం కేరళ వెళ్లిన వెంకీ

మళయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కేరళలోని ఇడుక్కి జిల్లాలో షూటింగ్ జరుపుకొంటోంది. దీనికోసం వెంకటేష్ కూడా కేరళ వెళ్లాడు. మళయాళ మాతృకలో సన్నివేశాలన్నీ కేరళలోనే ఉంటాయి కాబట్టి, ఈ రీమేక్లో కూడా ఒరిజినల్ లాగే కనపడేందుకు కేరళలో కొంత భాగం షూటింగ్ చేస్తున్నట్లు ఈ సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రం వెలుపల కూడా ఇంకా చాలా సన్నివేశాలు ఉంటాయని, మొదటి షెడ్యూల్ త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు.

శ్రీప్రియ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, నదియా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తన కుటుంబం చేసిన ఓ హత్యను కప్పిపెట్టేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నం గురించి ఈ సినిమా ఉంటుంది. మళయాళంలో సూపర్స్టార్ మోహన్లాల్ ఈ పాత్రను పోషించారు. తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో సీనియర్ నటుడు రవిచంద్రన్ హీరోలుగా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement