
కమల్ దృశ్యం ఆవిష్కరణకు వేళాయే!
చూసే దృశ్యం ఏదైనా కనువిందు చేస్తే ఆహా ఎంత బాగుంది అని అనకుండా ఉండలేం. ప్రస్తుతం దృశ్యం చిత్రం కూడా. సినీ ప్రియులకు అలాంటి అనుభూతినే కలిగిస్తోంది. దక్షిణాదిలోని మలయాళం, కన్నడం, తెలుగు భాషల సినీ అభిమానులను విపరీతంగా అలరించిన ఁదృశ్యం* చిత్రం నాలుగో భాష అయిన తమిళ సినీ ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. దీనికు ప్రఖ్యాత నటుడు పద్మభూషణ్ కమలహాసన్ ప్రధాన రూపం కానున్నారు.
ఉత్తమ విలన్ చిత్రానికి తుది రూపం ఇస్తున్న కమలహాసన్ తదుపరి ఁదృశ్యం* ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నారు. వైట్ ఆంగిల్ క్రియేషన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల చెన్నైలో జరిగాయి. చిత్ర షూటింగ్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారుు. ఒరిజినల్ చిత్రం మలయాళంలో ఁదృశ్యం*ను తెరకెక్కించిన జీతు జోసఫ్‌కే తమిళంలోను దర్శకత్వం వహించనున్నారు.
రచయిత జయమోహన్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ చిత్రంలో కమల్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటించనున్నారు. తల్లిగా నటి గౌతమి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.