ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ! | Tabu: Ajay is special to me because I had my career's first | Sakshi
Sakshi News home page

ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ!

Published Mon, Jul 6 2015 6:32 AM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ! - Sakshi

ఆయన అడిగితే అతిథి పాత్రకైనా రెడీ!

  ‘‘నా జీవితంలో అజయ్ దేవగన్ చాలా స్పెషల్. ఎందుకంటే  నేను, అజయ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అతనితో నాకెంతో సాన్నిహిత్యం ఉంది’’ అని కథానాయిక టబు అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘విజయ్‌పథ్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని టబు అన్నారు. కానీ, ఆ తర్వాత అజయ్, టబు కలిసి సినిమా చేయలేదు. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు అజయ్ దేవగన్‌తో కలిసి మలయాళ ‘దృశ్యం’ రీమేక్‌లో నటించారు టబు. దీని గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘మా కజిన్, అజయ్, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. నేను అజయ్‌ను ‘వీడీ’ అని పిలుస్తా. అజయ్ అడిగితే అతిథి పాత్ర చేయడానికి కూడా నేను రెడీ’’ అన్నారు. ఈ పద్ధెనిమిదేళ్లల్లో తామిద్దరం కలిసి నటించకపోవడం ఆశ్యర్యంగా ఉందని టబు చెబుతూ - ‘‘సినిమాలు మేమిద్దరం కలిసి నటించకపోయినా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాం. పార్టీల్లో అయితే మా ఇద్దరి అల్లరికి అంతే ఉండదు. సరదాగా ఆటపట్టించుకుంటూ ఉంటాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement