లెఫ్ట్ బాటలో... | Kamal Haasan Wraps Up Shoot For Papanasam | Sakshi
Sakshi News home page

లెఫ్ట్ బాటలో...

Published Sun, Dec 14 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

లెఫ్ట్ బాటలో...

లెఫ్ట్ బాటలో...

కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశమ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాంతో కమల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన మనసులో ఓ చిత్రం ఉందట. ఆ చిత్రానికి ఆయన ‘వామ మార్గమ్’ అని టైటిల్ కూడా అనుకున్నారు. అంటే.. ఎడమ దారి అని అర్థం. దీని గురించి కమల్ చెబుతూ, ‘‘కమ్యూనిస్టులను లెఫ్టిస్ట్‌లు అంటారు. అలాగే, అఘోరాలు కూడా వామ మార్గాన్ని అనుసరి స్తుంటారు. కానీ, నా సినిమా వీటికి సంబంధించినది కాదు. వ్యాపారంలో ఉండాల్సిన విలువలు గురించి చెప్పే చిత్రం. ‘మరుదనాయగమ్’, ‘మర్మయోగి’, ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’), ‘విశ్వరూపం’ చిత్రకథలు నా మనసును ఎలా తొలిచేశాయో ఈ కథ కూడా నన్నలా తొలిచేస్తోంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement