ఈ తరుణం గుర్తుండిపోతుంది! | Jyothika and Karthi Film with Jeethu Joseph Starts Rolling | Sakshi
Sakshi News home page

ఈ తరుణం గుర్తుండిపోతుంది!

Published Sun, Apr 28 2019 10:17 AM | Last Updated on Sun, Apr 28 2019 10:19 AM

Jyothika and Karthi Film with Jeethu Joseph Starts Rolling - Sakshi

వదిన జ్యోతికతో కలిసి తెరపై తొలిసారిగా నటిస్తున్నా. చాలా సంతోషంగా ఉం ది అని నటుడు కార్తీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు అగ్ర కథానాయకిగా రాణించిన జ్యోతిక.. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత నటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది 36 వయదినిలే చిత్రంతో మళ్లీ నటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటిస్తున్నా రు. తాను రీ ఎంట్రీ అయిన తరువాత భర్త సూర్యతో కలిసి నటించే సందర్భం రాలేదు.

కానీ ఇప్పుడు తన మరిది, నటుడు కార్తీ తో కలిసి నటించడానికి జ్యోతిక సిద్ధం అయ్యా రు. వీరు చిత్రంలో కూడా వదినా మరిదిగా నటించడనుండడం విశేషం. మలయాళ దర్శకుడు జిత్తు జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైకం 18 స్టూడియోస్‌ సమర్పణలో పారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఈ చిత్రం గురించి నటుడు కార్తీ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ వెండితెరపై వదినతో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జిత్తు జోసెఫ్‌ దర్శకత్వం లో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీ ఆశీస్సులతో చిత్రం ఈ రోజు ప్రారంభం అయ్యిందన్నారు. నటుడు సూర్య కూడా కార్తీకి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే కార్తీకి ఈ తరుణం నట పయనంలో గుర్తుండిపోతుంది. తెరపై జ్యోతికతో కలిసి చూడడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. వెండితెర వదినకు మంచి అదృష్టం ఎదురు చూస్తోంది. శుభాకాంక్షలు అని సూర్య, కార్తీ తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. కార్తీ, జ్యోతికల చిత్రం కోసం అభిమానులే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే, వారి కుటుంబమే మరింత ఆసక్తిగా ఎదురు చూడడం నిజంగా విశేషమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement