![Trisha Krishnan upcoming film in Malayalam - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/11/trisha.1.jpg.webp?itok=S4UcyYd6)
కెరీర్ ఆరంభించిన పదహారేళ్లకు త్రిష మలయాళంలో గత ఏడాది తొలి సినిమా (హే జ్యూడ్) చేశారు. ఈ ఏడాది మళ్లీ కేరళ ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం. మోహన్‌లాల్ సరసన ఓ సినిమా చేయడానికి అంగీకరించారట. దాదాపు ఆరేళ్ల క్రితం మోహన్‌లాల్ హీరోగా ‘దృశ్యం’ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘దృశ్యం’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయిన విషయం తెలిసిందే.
జీతు జోసెఫ్ తెరకెక్కించే కథలు అలా అన్ని భాషలకూ సరిపోతుంటాయి. తాజా చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రూపొందించనున్నారట. నవంబరులో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఫారిన్‌లో జరుగుతుందట. ఈజిప్ట్, యూకె, కెనడా లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశారని మాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment