నటి కేసు: సూపర్‌స్టార్‌ను ప్రశ్నించిన పోలీసులు | Malayalam superstar Dileep Questioned in actress case | Sakshi
Sakshi News home page

నటి కేసు: సూపర్‌స్టార్‌ను ప్రశ్నించిన పోలీసులు

Published Thu, Jun 29 2017 6:35 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

నటి కేసు: సూపర్‌స్టార్‌ను ప్రశ్నించిన పోలీసులు - Sakshi

నటి కేసు: సూపర్‌స్టార్‌ను ప్రశ్నించిన పోలీసులు

తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, వేధింపుల కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను పోలీసులు విచారించారు. నటి కేసు విషయమై నటుడు దిలీప్‌నకు ఇది వరకే సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో తనను ఇరికించకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు ఇవ్వాలని నిందితుడు పల్సర్ సునీ డిమాండ్‌ చేసినట్లు దిలీప్ చెప్పారు. ఈ క్రమంలో సూపర్ స్టార్‌తో పాటు దర్శకుడు నదిర్షాను బుధవారం దాదాపు 12 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. నటి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తనను బెదిరిస్తున్నాడని నటుడు దిలీప్ ఇటీవల ఆరోపించారు.

ఇటీవల టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఎవరైతే ఈ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి, ఆమె మంచి మిత్రులని, చాలా క్లోజ్‌గా ఉండేవారని దిలీప్ వ్యాఖ్యానించాడు. కాగా, నటితో పాత గొడవల నేపథ్యంలో దిలీప్‌ ఈ పని చేయించారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని దిలీప్‌ తర్వాత వివరణ ఇచ్చారు. కేసు విషయంలో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అన్ని వివరాలను పోలీసులకు తెలిపానంటూ విచారణ అనంతరం నటుడు దిలీప్ మీడియాకు చెప్పారు.

స్నేహం ఎవరితో చేయాలనే విషయంలో ముందుగానే జాగ్రత్త పడితే మంచిదన్న దిలీప్ వ్యాఖ్యలపై భావన స్పందించారు. గత సోమవారం దిలీప్ ఈ వ్యాఖ్యలు చేయగా నటి మాట్లాడుతూ.. 'ఆయన వ్యాఖ్యలు నన్నెంతో బాధ పెట్టాయి. ఇలా నాకు వ్యతిరేకంగా ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోను' అంటూ హెచ్చరించారు. భావన కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్నందునే దిలీప్‌ను నిందితుడు పల్సర్ సునీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నటుడు దిలీప్‌ను బుధవారం 12 గంటలపాటు ప్రశ్నించారు.

గత ఫిబ్రవరి నెలలో కేరళలోని ప్రముఖ నటిపై ఆమె డ్రైవర్‌, మరో ఆరుగురు వ్యక్తులు కలిసి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రిశూర్‌ నుంచి కోచికి తిరిగొస్తున్న సమయంలో ఆమెను కిడ్నాప్‌ చేసి ఈ దురాఘతానికి పాల్పడగా అది పెద్ద దుమారం రేగింది. అప్పటినుంచి కేసు విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement